ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎప్పటి నుంచి రైతులు ఎదురు చూస్తున్న చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది సంక్షేమ పతకాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రైతుల విషయంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతు కుటుంబాలకు మేలు జరిగే విధంగా 2,06,171 ఎకరాల చుక్కల భూములకు పూర్తి హక్కులు అందించే బృహత్కర కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ మహిళా రైతు సీఎం జగన్ సమక్షంలో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఏపీలో దశాబ్దాల సమస్యకు చరమగీతం.. చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం కల్పించారు.. గత కొంతకాలంగా రైతన్నలకు ఇబ్బందికరంగా ఉన్న చుక్కల భూముల సమస్యలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెక్ పెట్టారు. ఈ సందర్బంగా రైతులు తమ ఆనందాన్ని స్టేజ్ పై వ్యక్తం చేశారు. బోగోలు మండలం జక్కేలపల్లి గూడురు కి చెందిన మమత అనే మహిళా రైతు మాట్లాడుతూ.. తమకు మూడు ఎకరాల పొలం ఉందని.. ఆ భూమి సేద్యం చేసుకొవడానికి ప్రతిసారి బయట అప్పు తెచ్చుకోవాల్సి వస్తుందని.. ఇప్పటి వరకు ఈ పొలంపై మాకు హక్కులు ఉండేవి కాదు.. కానీ ఈ రోజు సీఎం జగన్ అన్న పుణ్యమా అని మా భూమిపై హక్కులు కల్పించారు. చాలా సంతోషంగా ఉంది.. ఒక్కరోజులోనే నన్ను రూ.50 లక్షల విలువైన పొలానికి వారసురాలిగా చేశారు అన్నారు. ఈ రోజున నాకంటూ సొంత పొలం ఉందని గర్వంగా చెప్పుకునేలా చేసిన సీఎం జగన్ కి నా కుటుంబం తరుపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు.
ఈరోజు నన్ను రూ.50 లక్షల పొలానికి వారసురాలిని చేశావ్ అన్నా..సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించిన స్థానిక మహిళ..
FULL VIDEO – https://t.co/BS7ppwQNcs#YSJaganWithFarmers #YSJagan #AndhraPradesh #CMYSJagan #NTVTelugu pic.twitter.com/oAB6f1za4v
— NTV Telugu (@NtvTeluguLive) May 12, 2023