ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర ప్రమాదం జరిగింది. దర్శి దగ్గర అదుపుతప్పి సాగర్ కెనాల్ లోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్లో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంతోషకరమైన వాతావరణంలో శుభకార్యాలు జరుగుతున్న వేళ అనుకోకుండా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్ని ప్రమాద నివారణా చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు రోజురోజుకి ఎక్కువగానే జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలతో బాధిత కుటుంబాలు విషాదం చెందుతున్నాయి. వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్థికంగా చాలా చితికిపోతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా దర్శిలో పెళ్లి బృందం బస్సు ప్రమాదానికి గురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర ప్రమాదం జరిగింది. దర్శి దగ్గర అదుపుతప్పి సాగర్ కెనాల్ లోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ యువకుడు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. పొదిలి నుండి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో బస్సును బయటకు తీశారు.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురు ఉన్నట్లు తెలుసింది. బస్సు కింద నీటిలో చిక్కుకున్న ఆరేళ్ల పాపా మృతదేహాన్ని వెలికి తీశారు. పాప మృతదేహాన్ని పోలీసులు అతి కష్టంతో బయటకు తీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన వారి వివరాలు: అబ్దుల్ అజీస్(65), అబ్దుల్ హాని(60), షేక్ రమిజ్(48), ముల్లా నూర్జహాన్(58), ముల్లా జానీ బేగం(65), షేక్ షాభినా(35), షేక్ హీనా(6). క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు.
ఆదివారం పొదిలిలో పెళ్లికూతురు ఇంటిదగ్గర పెళ్లి జరుగగా.. మంగళవారం రోజు కాకినాడలో పెళ్లి కొడుకు ఇంటిదగ్గర విందులు (వలిమా). రిసెప్షన్ కోసం బస్సులో బయలుదేరిన పెళ్లికూతురు తరపు బంధువులు. కాకినాడలో రిసెప్షన్ కు వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుసింది. ప్రత్యక్ష సాక్షులు డ్రైవర్ నిద్ర మత్తే కారణమంటున్నారు.పెళ్లింట అంతులేని విషాదం నెలకొంది. పెళ్లికూతురు తండ్రి సిరాజ్, పెళ్లికొడుకు తండ్రి మంజూర్ అహ్మద్ ఇద్దరూ సౌదీలో ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లల పెళ్లిల కోసం ఇండియాకు వచ్చారు. పెళ్లింట అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది.