పాము అన్న వినబడితే చాలు ఒళ్లంతా గగుర్పడొస్తూ ఉంటుంది. ఇంకా అది కనబడితే భయంతో సగం చచ్చిపోతాం. ముందు మాట రాదు. మన దేశంలో చాలా రకాల పాములున్నాయి. వాటిల్లో అనేక జాతులున్నాయి. వాటిల్లో కొన్ని అరుదైనవి కూడా ఉన్నాయి. అటువంటిదే ఓ పాము విశాఖలో కనిపించి, కలవరపాటుకు గురి చేసింది.
పాములు అంటే ఎవ్వరికీ భయం కాదో చెప్పండి. పాము అన్న పేరు తలచుకున్నా, విన్నా ఒళ్లంతా గగుర్పడొస్తూ ఉంటుంది. ఇంకా అది కనబడితే చాలు భయంతో సగం చచ్చిపోతాం. మన దేశంలో చాలా రకాల పాములున్నాయి. వాటిల్లో అనేక జాతులున్నాయి. కొన్ని విషపూరితమైనవీ, కొన్ని కావు. తాచు పాము జాతికి చెందినవన్నీ విషపూరితమైనవి. అవి కరిస్తే నిమిషాల్లో ప్రాణాలు వదలాల్పిందే. ఇక ఆంధ్రప్రదేశ్ విశాఖ వంటి అటవీ ప్రాంతాల్లో శ్వేత నాగులు కూడా కనిపిస్తుంటాయి. మామాలు త్రాచుకు, శ్వేత నాగుకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అవి రంగు దగ్గర నుండి పడగ విప్పే విధానం వరకు భిన్నంగా ఉంటాయి.
అయితే ఈ శ్వేత నాగులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా విశాఖలోని జాలరి పేటలో ఈ తాచు పాము కనిపించి కంగారు పెట్టించింది. కోట వీధి సమీపంలో మేరీ మాత ఆలయం కొండ ప్రాంతం ఉంది. అక్కడి నుండి వచ్చిన శ్వేత నాగు జన సంచారంలోకి వచ్చింది. అనుకోకుండా వలకు చిక్కుకుపోయి విలవిలలాడుతోంది. ఈ పామును చూసిన స్థానికులు ముందుగా భయాందోళనలకు గురయ్యారు. అనంతరం స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. ఆ ప్రాంతానికి చేరుకున్న సదరు వ్యక్తి చాకచక్యంగా పాముని కాపాడారు. ఇది అరుదైన జాతిగా ఈ సర్పాన్ని గుర్తించినట్లు స్నేక్ క్యాచర్ కిరణ్ చెప్పారు.
చిన్నపాటి గాయాలు కావడంతో పాముకి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఈ అరుదైన శ్వేతనాగును జంతు శాస్త్ర విభాగానికి చెందిన అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. లేదంటే, దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అడవిలో విడిచి పెడతామని కిరణ్ తెలిపారు. ఇవి అరుదుగా జన సంచారంలోకి వస్తుంటాయని పేర్కొన్నారు. ఇది కరిస్తే కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు విడుస్తారట. అడవులు, చెట్టు కొట్టేయడంతో పలు జంతువులు, పక్షులు, ఇలాంటి పాములు జన సంచారంలోకి వస్తున్నాయి. ఇలా పాము జనాలు.. మనుషులు తిరుగుతున్న చోటుకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.