ప్రస్తుత కాలంలో.. ఎవరు ఎంత పెద్ద చదువు చదివినా సరే.. అందరి లక్ష్యం ఒక్కటే.. మంచి ఉద్యోగం సంపాదించాలి. ఇక ప్రస్తుతం కాలంలో మంచి ఉద్యోగం అంటే చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అని టక్కున చెబుతారు. అయితే ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు.. మరి వారందరికి సాప్ట్‌వేర్ ఉద్యోగం సాధిస్తున్నారా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఒక్క ఇంజనీరింగ్ అనే కాదు.. ఏ కోర్స్ చదివినా సరే.. ఉద్యోగం పొందే విషయానికి వస్తే.. సరైన గైడెన్స్ లేక.. చాలా మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారు. మరి కొన్ని సార్లు మనం చదివిన రంగంలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి.. వాటిని చేజిక్కించుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ ఉండాలి.. దానితో పాటు జాబ్ మార్కెట్‌లో ప్రధానంగా ఉండాల్సిన స్కిల్స్ గురించి తెలిసి ఉండాలి.
అయితే ప్రధానంగా బయట చాలా ఇన్‌స్టిట్యూట్‌లు.. ఏదో ఒక దాని మీదనే కోచింగ్ ఇస్తాయి. కానీ అలా కాకుండా.. అభ్యర్థులు చదువుతో సంబంధం లేకుండా.. అభ్యర్థికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి.. ఇంకేం స్కిల్స్ అవసరమవుతాయి అనే దాని గురించి ట్రైనింగ్ ఇచ్చి.. రియాలిటీలో వారిని ఆ దిశగా ట్రైన్ చేసి.. జాబ్ తెచ్చుకునేందుకు దోహదపడుతుంది ఇంటర్న్ స్టంప్ అనే సంస్థ. మరి ఈ సంస్థ ఎక్కడ ఉంది.. వీరిని ఎలా అప్రోచ్ అవ్వాలి.. ట్రైనింగ్ ఎలా ఉంటుంది.. ఎవరెవరు అర్హులు వంటి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.