ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యనభ్యసించి సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పిస్తూ ప్రవేశ పరీక్షలకు సిద్దం చేస్తుంటారు.
ఈ కాలంలో ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగం చేస్తే సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయని ప్రతి తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే తమ పిల్లలకు మంచి విద్యనందించడానికి ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ఖర్చులైనా భరించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తుంటారు. టెన్త్, ఇంటర్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఉన్న విద్యనభ్యసించడానికి తయారవుతారు. జేఈఈ, నీట్ దేశంలో అత్యున్నత ప్రవేశ పరీక్షలు.. ఈ పరీక్షలకు సిద్దం కావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు అన్న విషయం తెలిసిందే.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు కోచింకు వెళ్లలేని వారి కోసం ఇటీవల జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల కోసం డిజిటల్ పాఠాలు రూపొందిస్తున్నారు. తాజాగా నీట్, జేఈఈ 2024 ప్రవేశ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ‘కోటా’ డిజిటల్ మెటీరియల్ సిద్దం చేస్తున్నట్లుగా ఐఐటీ-జేఈఈ మరియు నీట్ ఫోరం తెలియజేసింది. ప్రవేశ పరీక్షలకు ప్రిపరేషన్ అయ్యే విద్యార్థులకు కోటా డిజిటల్ మెటీరియల్ లో 2024 కు పరీక్షలకు సంబంధించిన పూర్తి డిజిటల్ స్టడీ మెటీరియల్ అందించేందుకు సిద్దమైంది.
డిజిటల్ స్టడీ మెటీరియల్ లో కాన్సెప్ట్, మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 2023-24 ‘కోటా’ గ్రాండ్ టెస్ట్, సొల్యూషన్స్, ‘కోటా’ ప్రీవియస్ టెస్ట్స్, యన్‌సిఈఆర్‌టి నీట్ ప్రశ్నలు, టెస్ట్ సీరీస్, బ్యాంక్, ర్యాంక్ బూస్టర్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తుంది. ఏ మెటీరియల్ అయినా రూ.499/- కు పొందవొచ్చు. పూర్తి వివరాల కోసం నీట్ ప్రిపరేషన్ కోసం NEET 2024 అని, జేఈఈ ప్రిపరేషన్ విద్యార్థులు JEE 2024 అని టైపు చేసి 9849016661 కు వాట్సాప్ మెసేజ్ చేయాలని ఫోరం సూచింది.