పట్టుదల ఉండాలే గాని సాధించలేనిదంటూ ఏమి ఉండదు. ఇప్పటివరకు ఎంతో మంది సామాన్యులు, పేదవారు అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసి చూపించారు. సాధించాలనే తపన ఉంటే సంచనాలు సృష్టించవచ్చు.రాజస్థాన్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు కటిక దాటుకొని విజయం సాధించారు.
పట్టుదల ఉండాలే గాని సాధించలేనిదంటూ ఏమి ఉండదు. ఇప్పటివరకు ఎంతో మంది సామాన్యులు, పేదవారు అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసి చూపించారు. సాధించాలనే తపన ఉంటే సంచనాలు సృష్టించవచ్చు. తెలివి, జ్ఞానం ఎవరి సొత్తు కాదు. అవి రెండు ఉంటే నీదే విజయం అవుతుంది. చదువులో రానించాలంటే గొప్పింటి పిల్లలే కావాల్సిన అవసరం లేదు. డబ్బు లేకపోయినా పర్వాలేదు అనినిరూపించారు ఇద్దరు బాలికలు. ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో వీరు మాత్రం మట్టిలో మాణిక్యంలా మెరిశారు. వారి చిన్ననాటి కళను తీర్చుకొని తల్లి దండ్రులకి గొప్ప బహుమతి ఇచ్చారు. ఇంతకీ ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అది రాజస్థాన్ లోని ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో వసతులు ఏమి సరిగ్గా ఉండవు. పైగా వారిది కటిక పేదరికం. చదుకోవాలంటే కనీసం బస్ సదుపాయం కూడా ఉండేది కాదు. 10 కిలోమీటర్లు నడిచే వెళ్లాల్సిన పరిస్థితి. ఇక ఏమైనా అనారోగ్యం సంభవిస్తే 18 కిలోమీటర్ల దూరం పరిగెత్తాల్సిందే. తులసి దాస్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు నీట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. వారి పేర్లు ఉపేంద్ర యాదవ్, కరీనా యాదవ్. వీరిద్దరూ దగ్గర బంధువులు. వీరు తల్లి తండ్రులు గొర్రెల కాచుకుంటూ చిన్నగా జీవనం సాగిస్తున్నారు. కానీ వీరిద్దరికి చిన్నప్పటినుంచి డాక్టర్ కావాలని కోరిక ఉండేది. తమ ఊరికి వైద్య సదుపాయం లేదని వారిద్దరూ డాక్టర్లు గా మారి ఆ గ్రామంలో పేద వారికి సేవ చేయాలనుకుంటున్నారు. ఇండియా వైడ్ గా జరిగే ఈ ఎగ్జామ్ ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వీరిద్దరూ మాత్రం పట్టుదలగా చదువుకొని నీట్ లో మంచి మార్కులు తెచ్చుకున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పదానికి మరోసారి నిర్వచనంలో నిలిచారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.