ఐఐటీ-జేఈఈ సీట్ల భర్తీ వివరాలతో కూడిన బుక్‌లెట్స్‌ను ఫోరం సిద్ధం చేసింది వాట్సాప్ ద్వారా బుక్‌లెట్స్‌ను పొందే వీలు కల్పించింది.
ఐఐటీ-జేఈఈ సీట్ల భర్తీ వివరాలతో కూడిన బుక్‌లెట్స్‌ను ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం సిద్ధం చేసింది. సీట్ల భర్తీకి సంబంధించిన కళాశాలలు, కోర్సులు, ఐఐటీ, ఎన్ఐటీ, సెల్ఫ్ ఫైనాన్స్, సెంట్రల్ ఫండెడ్, ఇతర కళాశాలల్లో రిజర్వేషన్లు, ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల (ఆరు రౌండ్ల సీట్స్ అలాట్మెంట్) విశ్లేషణతో కూడిన డిజిటల్ బుక్‌లెట్స్‌ను విద్యార్థుల అవగాహన కోసం మెయిన్, అడ్వాన్స్డ్ 2022 సీట్ల భర్తీ బుక్‌లెట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బుక్‌లెట్స్‌ను విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందేందుకు సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. మరింత సమాచారం కోసం JEE Booklet అని టైప్ చేసి 98490 16661 వాట్సాప్ లో మెసేజ్ చేయవలసిందిగా ఫోరం సూచించింది. మరి మీకు సీట్ల భర్తీ వివరాలతో కూడిన బుక్‌లెట్స్ కావాలంటే గనుక పై నంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేయండి.