జాతీయ స్థాయిలో జరిగే నీట్, జేఈఈ పరీక్షల గురించి అందరికీ విదితమే. ఈ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి.. ఉన్నత విద్యాసంస్థల్లో చేరాలని విద్యార్థులు కలలు కంటుంటారు. మెరుగైన ర్యాంకులు సాధించడం కోసం అహర్నిశలు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అలాంటి వారికి ‘కోటా పేజెస్’ సంస్థ శుభవార్త చెప్పింది. నీట్, జేఈఈ 2023 ప్రవేశ పరీక్షల కు సిద్ధమవుతోన్న విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్స్ మరియు సొల్యూషన్ ను సిద్ధం చేసినట్లు తెలిపింది.
ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారంతో నీట్, జేఈఈ పరీక్షల కోసం 250 ‘కోటా’ గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్‌ను పీడీఎఫ్ రూపంలో ప్రిపరేషన్, ప్రాక్టీస్ కోసం సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం కన్వీనర్ కె.లలిత్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభా శక్తి సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ఈ గ్రాండ్ టెస్ట్స్ ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం నీట్ విద్యార్థులు.. NEET GT అని, జేఈఈ విద్యార్థులు.. JEE GT అని టైప్ చేసి 98490 16661 నెంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేయాలని కోరారు.