ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యనభ్యసించి సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పిస్తూ ప్రవేశ పరీక్షలకు సిద్దం చేస్తుంటారు.
ఐఐటీ-జేఈఈ సీట్ల భర్తీ వివరాలతో కూడిన బుక్‌లెట్స్‌ను ఫోరం సిద్ధం చేసింది వాట్సాప్ ద్వారా బుక్‌లెట్స్‌ను పొందే వీలు కల్పించింది.
జాతీయ స్థాయిలో జరిగే నీట్, జేఈఈ పరీక్షల గురించి అందరికీ విదితమే. ఈ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి.. ఉన్నత విద్యాసంస్థల్లో చేరాలని విద్యార్థులు కలలు కంటుంటారు. మెరుగైన ర్యాంకులు సాధించడం కోసం అహర్నిశలు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అలాంటి వారికి ‘కోటా పేజెస్’ సంస్థ శుభవార్త చెప్పింది. నీట్, జేఈఈ 2023 ప్రవేశ పరీక్షల కు సిద్ధమవుతోన్న విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్స్ మరియు సొల్యూషన్ ను సిద్ధం చేసినట్లు తెలిపింది. ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారంతో […]
జాతీయ స్థాయిలో జరిగే నీట్, జేఈఈ పరీక్షల గురించి అందరికీ విదితమే. నీట్ అనేది మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. డాక్టర్ కావాలనుకునే ప్రతి విద్యార్థి ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో వారికొచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందుతారు. అలాగే ‘జేఈఈ’ విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో వారికొచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు […]
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని భావించి.. ఓ ధ్రుడ సంకల్పంతో ముందుకు వెళ్లేవారిని ఎలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టలేవు. మొక్కవోని వారి ధైర్యం, సంకల్ప బలం ముందు విధి సైతం తలవంచుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో నిరూపించారు. తాజాగా ఈ జాబితాలోకి మరో తెలుగు విద్యార్థిని చేరింది. సామాన్యంగా పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏం చేస్తారు.. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వీడియోలు, రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మనకు […]
NEET: కేరళలోని కొల్లాంలో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది దారుణంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ నీట్ పరీక్ష కేంద్రం కేటాయించారు. ఇక, పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలను అక్కడి సిబ్బంది నిశితంగా తనిఖీలు చేశారు. ఎన్టీఏ మార్గదర్శకాల్లోని డ్రెస్‌కోడ్ ప్రకారం.. లోహపు(మెటల్) వస్తువులు ధరించి వస్తే ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించరు. లోదుస్తులకు సంబంధించి అక్కడి సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో, తీవ్ర అవమానకర […]
ఇటీవల కాలంలో దేశంలో పలు చోట్ల మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి. పలు అవమానకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతమైన విద్యనభ్యసించడానికి ప్రవేశ పరీక్ష కోసం హాజరయ్యేందుకు వచ్చిన యువతుల పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది. కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ నీట్ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తామని చెప్పారు. అయితే.. ఎన్టీఏ […]
దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు బంపరాఫర్ ప్రకటించింది. నీట్ 2022 పరీక్ష రాయనున్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి 18లక్షల మందికి పైగా విద్యార్ధులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్ పై 60% డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి పరీక్షా […]
Crime News : రాష్ట్రంలో ర్యాగింగ్ బూతం మరోసారి కోరలు చాస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొంతమంది సీనియర్లు జూనియర్‌పై దాడి చేసిన ఘటన ఏపీ నీట్ ప్రాంగణంలో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నీట్లో కొందరు సీనియర్లు ఓ జూనియర్‌ను కొన్ని నెలలుగా ర్యాగింగ్ చేస్తున్నారు. చాలా బాధ పడ్డ సదరు జూనియర్.. సీనియర్లపై కోపం పెంచుకున్నాడు. వారి ఫోన్ నెంబర్లు సేకరించాడు. తన ఫోన్ నెంబరు కనిపించకుండా వారికి ఎస్ఎమ్ఎస్లు పంపాడు. ఇది గుర్తించిన […]
ఓ జీవితంలో వెలుగు నిండాలంటే చదువును మించిన ఆయుధం ఇంకోటి ఉండదు. ఇంట్లో ఒక్కరు బాగా చదువుకుంటే ఆ కుటుంబం మొత్తానిది తలరాత మారిపోద్ది. కానీ.., మనలో చాలా మంది ఆ చదువును నిర్లక్ష్యం చేస్తుంటారు. పరిస్థితుల కారణంగా మధ్యలో ఆగిపోయే చదువులే చాలా ఎక్కువ. కానీ.. తమిళనాడుకి చెందిన తంగపచ్చి కథ అది కాదు. వ్యవసాయ కూలీగా పని చేస్తూనే చదువు గాడి తప్పకుండా చూసుకుంది తంగపచ్చి. నీట్ లో ర్యాంక్ సాధించింది. ఆ వివరాలు.. […]