బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన బ్యూటీ సిల్క్ స్మిత. హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది. వారికి ధీటుగా స్టార్‌డం సంపాదించుకుంది. అంతలోనే ఉన్నట్లుండి మృతి చెందింది. మళ్లీ ఇన్నేళ్ల మళ్లీ సిల్క్ స్మిత జనాల ముందుకు వచ్చేసింది. నమ్మడం లేదా.. అయితే ఇది చదవండి.
సిల్క్ స్మిత.. సుమారు పాతికేళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీని తన మత్తు కళ్లతో శాసించింది. సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా సరే.. స్మిత ఐటెం సాంగ్ లేకపోతే ఫట్టే అన్న రేంజ్‌లో ఉండేది సిల్క్ స్మిత క్రేజ్. కళ్లతోనే మత్తు చల్లెది. సుమారు దశాబ్దానికి పైగా సాగిన కెరీర్‌లో సిల్క్ స్మిత వందల చిత్రాల్లో నటించారు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో పనిచేసింది. టాప్ స్టార్స్ అందరితో జతకట్టింది. బికినీలు, స్విమ్ సూట్‌లు వేసుకొని వెండితెరను ఓ ఊపు ఉపేసింది. మత్తుకళ్ల పిల్లగా ప్రేమగా ప్రేక్షకుల చేత పిలిపించుకున్న స్మిత.. ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. నేటికి కూడా ఆమె మృతిపై అనేక సందేహాలు ఉన్నాయి. అభిమానులు నేటికి కూడా ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా విడుదలైన దసరా సినిమాలో కూడా సిల్క్ బార్ మీద స్మిత రూపం కనిపించి.. మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఇలా ఉంటే ఇక తాజాగా సిల్క్ స్మిత సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొంటె చూపుతో ఈ కాలం కుర్రాళ్ల మతి పొగొడుతుంది. ఏంటి చదవగానే మీకు మతి పోయిందా.. ఎప్పుడో చనిపోయిన సిల్క్ స్మిత.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవ్వడం ఏంటి.. కుర్రాళ్ల మతి పొగొట్టడం ఏంటి.. ఏదైనా టెక్నాలజీ అనుకుంటున్నారా.. కాదు. నిజంగా సిల్క్ స్మితనే. అదేలా సాధ్యం అంటే.. ఇదుగో ఇలా అంటుంది జూనియర్ సిల్క్ స్మిత అలియాస్ విష్ణు ప్రియ. ఫేస్‌కట్, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిల్క్ స్మితను గుర్తు చేస్తోన్న విష్ణు ప్రియను తొలి సారి సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసింది. మరి ఆమె ఎందుకు సిల్క్ స్మితలా మారింది.. సినిమాల కోసమా.. అసలు ఆమెకు సిల్క్ స్మితకు సంబంధం ఏంటి వంటి పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.