కోహ్లీ రికార్డు సృష్టిస్తాడా!

Team India Cape Town Win

సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ప్రతిసారి ఎన్నో ఆశలతో ప్రొటీస్‌ గడ్డపై అడుగుపెట్టే టీమిండియా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వస్తోంది. ప్రస్తుత 3 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సెంచూరియన్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో విజయంతో 1-0 ఆధిక్యంలోకి వచ్చిన భారత్ , జొహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఓటమి పాలయింది. ప్రస్తుతం 1-1 తో సమంగా  ఉన్నప్పటికీ కేప్ టౌన్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కేప్ టౌన్ లో భారత ఆటగాళ్ల వీడియోని బీసిసిఐ ట్వీట్ చేసింది.

చివరిసారిగా 2018లో సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్‌ 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. 1991 నుంచి చూసుకుంటే సౌతాఫ్రికా, భారత్‌ల మధ్య 41 టెస్టు మ్యాచ్‌లు జరగగా.. టీమిండియా 15 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. సౌతాఫ్రికా 16 విజయాలు సాధించింది. 10 మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి. భారత్‌ ఇప్పటివరకు సౌతాఫ్రికాలో ఏడుసార్లు పర్యటించగా.. ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవలేదు. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు నమోదు చేసింది. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ మూడో టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు.