భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు మంగళవారం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి. చివరి టెస్టులో విజయం సాధించి ఎలాగైన సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరుజట్లు గట్టిగానే ప్రయత్నిస్తాయి. ఇప్పటికే ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో ముగిపోయారు. కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు కేప్ టౌన్ చేరుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. కేప్ టౌన్ మైదానంతో తనకున్న అనుబంధాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నాడు. […]
‘మూడు టెస్టులు, మూడు వన్డేలు సిరీస్ కోసం భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇరుజట్లు 1-1 తో గెలిచి సమంగా ఉన్నాయి. అయితే కేప్ టౌన్ లో జరగనున్న మూడో టెస్టు విజయంపై అటు సౌతాఫ్రికా, ఇటు టీమిండియా ఎంతో ధీమాగా ఉన్నాయి. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుంటే, స్వదేశంలో భారత్‌పై తమకున్న రికార్డును పదిలంగానే ఉంచాలని […]
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ప్రతిసారి ఎన్నో ఆశలతో ప్రొటీస్ గడ్డపై అడుగుపెట్టే టీమిండియా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వస్తోంది. ప్రస్తుత 3 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో విజయంతో 1-0 ఆధిక్యంలోకి వచ్చిన భారత్ , జొహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఓటమి పాలయింది. ప్రస్తుతం 1-1 తో సమంగా ఉన్నప్పటికీ కేప్ టౌన్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో […]