టీ20 ప్రపంచకప్‌ స్క్వాడ్‌ ఇదే.. ఎవరు ఔట్‌? ఎవరు ఇన్‌?

Virat

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఎంతో దూరంలో లేదు. అక్టోబర్‌ 17 నుంచి యూఏఈ, ఒమన్‌ వేదికగా పొట్టి క్రికెట్‌ సంబరం ప్రారంభంకానుంది. ఇప్పటికే చాలా జట్లు యూఏఈ చేరుకున్నాయి. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని నెట్స్‌లో సందడి చేయడం కూడా మొదలు పెట్టారు. అక్టోబరు 15న ఐపీఎల్‌ ఫైనల్‌ అయిపోగానే వెంటనే టీ20 ఫీవర్‌ స్టార్ట్‌ అవుతుంది. ఇప్పటికే అన్ని దేశాలు తమ తుది జట్లను ప్రకటించాయి. అక్టోబరు 10 వరకు మార్పులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియాలో పెద్దగా మార్పులు ఏం జరగలేదు. పర్ఫార్మెన్స్‌ దృష్ట్యా కొన్ని మార్పులు వస్తాయని భావించారు. అసలు స్క్వాడ్‌ ఇదే.

పెద్దగా మార్పుల్లేవ్‌

టీమిండియాలో చాలా మార్పులు జరుగుతాయని అందరూ చెప్పుకొచ్చారు. కానీ, ఎలాంటి మార్పులు జరగలేదు. ఒకే ఒక్క మార్పు జరిగింది. అది కూడా అక్షర్‌ పటేల్‌ స్థానంలో మెయిన్‌ 15లోకి శార్దూల్‌ ఠాకూర్‌ వచ్చాడు. అక్షర్‌ పటేల్‌ ట్రావెల్‌ రిజర్వ్‌లోకి చేరాడు. అందరూ చాహల్‌ జట్టులోకి వస్తాడు అని చాలా మంది అభిప్రాయ పడ్డారు. రావాలని గట్టిగా కోరారు కూడా కానీ, అది సాధ్యం కాలేదు. ట్రావెల్‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా కూడా చాహల్‌కు స్థానం దక్కలేదు. ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా అప్పటికప్పుడు మార్పులు చేయడం కుదరదు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే నిజం అయ్యింది.

తుది జట్టు ఇదే

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, జాస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ

ట్రావెల్‌ రిజర్వ్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, అక్షర్‌ పటేల్‌