ఒక్క జెర్సీలో ఎన్ని విశేషాలో.. ఆకట్టుకుంటున్న టీమిండియా బిలియన్‌ ఛీర్స్‌ జెర్సీ

Team India Jersey

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ ఫీవర్‌ మొదలైంది. ఈసారి టీ20 ప్రపంచకప్‌ హోస్ట్‌గా బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్టోబర్‌ 17 నుంచి యూఏఈ, ఒమన్‌ వేదికగా పొట్టి క్రికెట్‌ సంబరం ప్రారంభం కానుంది. బీసీసీఐ తమ తుది జట్టును ప్రకటించింది. తాజాగా టీ20 ప్రపంచకప్‌ టీమిండియా జెర్సీని లాంఛ్‌ చేశారు. ప్రపంచకప్‌ జెర్సీ అందరినీ ఆకట్టుకుంటోంది. బుర్జ్‌ ఖలీఫాపై జెర్సీని అఫీషియల్‌గా లాంఛ్‌ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జెర్సీలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

ఇదీ చదవండి: శార్దూల్‌ ఎంట్రీ వెనుక ధోనీ వ్యూహం.. మెంటర్‌ గా పని ప్రారంభించేశాడుగా!

బిలియన్‌ ఛీర్స్‌ జెర్సీ

బిలియన్‌ ఛీర్స్‌ జెర్సీ పేరుతో టీమిండియా జెర్సీని లాంఛ్‌ చేశారు. గమనిస్తే జెర్సీసపై బ్లూ కర్‌లో లైన్స్‌ కనిపిస్తాయి. అవి కోట్లాది మంది అభిమానుల సపోర్ట్‌, దీవెనలకు ప్రతీకగా డిజైన్‌ చేశారు. జెర్సీ ఎడమ భాగంలో బీసీసీఐ లోగోతోపాటు 3 స్టార్లు కనిపిస్తాయి. క్రికెట్‌ చరిత్రలో టీమిండియా మూడు ప్రపంచకప్‌లు సాధించిన సందర్భంగా వాటిని రిప్రెసెంట్‌ చేస్తూ ఆ మూడు నక్షత్రాలను డిజైన్‌ చేశారు. ‘లెజెండ్‌ కపిల్‌ దేవ్‌ సారథ్యంలో 1983 వన్డే ప్రపంచకప్‌, ఎంఎస్‌ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటిని సూచిస్తూనే ఆ స్టార్స్‌ను ఏర్పాటు చేశారు.

‘గెట్‌ రెడీ టూ ఛీర్‌ ఫర్‌ ఇండియా’ అంటూ లాంఛ్‌ చేసిన జెర్సీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక, అభిమానులు అంతా అక్టోబరు 24న పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌ కోసమే ఎదురుచూస్తున్నారు. టీమిండియా, పాకిస్థాన్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేస్తుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.