ఐపీఎల్ ముగింపునకు వచ్చేసింది. ఒక్క మ్యాచ్‌తో సీజన్ క్లోజ్ అయిపోతుంది. అభిమానుల్లో జోష్ నింపేందుకు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ రానే వచ్చేస్తోంది. వార్మప్ మ్యాచ్‌లు, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లనే తలుచుకుంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. బీసీసీఐ తుది జట్టును కూడా ప్రకటించేసింది. జట్టులో పెద్దగా మార్పులు లేవు. అక్షర్ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్ మెయిన్ 15లో చోటు దక్కించుకున్నాడు. అక్షర్ ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఆ ఒక్క మార్పు తప్ప ఏ మార్పులు లేకుండా గతంలో ప్రకటించిన టీమ్‌నే ఖరారు చేసింది బీసీసీఐ. ఇప్పుడు ఆ ఒక్క మార్పు ఎందుకు జరిగింది. దాని వెనకాల ఎవరి హస్తం ఉందని ప్రశ్నలు మొదలయ్యాయి.
ఐపీఎల్ 2021 సీజన్‌లో శార్దూల్ తనని తాను నిరూపించుకున్నాడు. అందుకే ఐసీసీ టీ20 టీమిండియా స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. అంతవరకు బానే ఉంది. మొదట బీసీసీఐ మార్పులు చేయమని చెప్పినా.. తర్వాత శార్దూల్‌ను టీమ్‌లోకి తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యకత్మయ్యాయి. ఫామ్ పరంగా టీమ్‌లోకి వచ్చినా.. దాని వెనకాల ఏదో పెద్ద కారణం ఉండిఉంటుందని భావించారు. ఆ అనుమానం అవుననే టాక్ వినిపిస్తోంది. మెంటర్‌గా ధోనీ తన వ్యూహాలను అమలు చేయడం మొదలు పెట్టాడు. శార్దూల్ ఠాకూర్ టీమ్‌లోకి రావడం వెనుక ధోనీ మాస్టర్ ప్లాన్ ఉందనే తెలుస్తోంది. ఒత్తిడిలో బాగా బౌలింగ్ చేసి మంచి ప్రదర్శన చేశాడు శార్దూల్. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ దాకా వచ్చింది అంటే అందులో శార్దూల్ పాత్ర చాలానే ఉంది. అందుకే బీసీసీఐ ధోనీని మెంటర్‌గా ఎంచుకుంది అని సోషల్ మీడియాలో అప్పుడే ప్రశంసలు మొదలయ్యాయి కూడా. శార్దూల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం టీమిండియాకి ప్లస్ పాయింటేనా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.