కోహ్లీపై ఫిర్యాదు.. నిజం బయటపెట్టిన అశ్విన్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మధ్య విభేదాలు ఉన్నాయని, కోహ్లీ తీరుపై బీసీసీఐకి అశ్విన్‌ ఫిర్యాదు కూడా చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లీ యాటీట్యూడ్‌ చూపిస్తున్నాడని, తనను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్‌ అయ్యేలా ప్రవర్తించాడంటూ అశ్విన్‌ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ విషయాలను బీసీసీఐ కూడా సీరియస్‌గా తీసుకుని కోహ్లీపై చర్యలు సిద్దమైనట్లు కథనాల్లో పేర్కొన్నారు.

ఇంతకు ముందే టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటానని ప్రకటించిన కోహ్లీకి షాక్‌ ఇస్తూ వన్డే కెప్టెన్‌గా కూడా తొలగించనున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో కోహ్లీ-అశ్విన్‌ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నట్లు అందరూ భావించారు. ఈ విషయమై అశ్విన్‌ తొలిసారి స్పందించాడు. తాను కోహ్లీపై బీసీసీఐ కి ఫిర్యాదు చేసినట్లు ఫేక్‌ వార్తలు పుట్టించేది ఎవరో తెలిసిందంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. దీంతో తన కోహ్లీపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లే నని అశ్విన్‌ తేల్చేశాడు.

VIrat Kohli and Ashwin - Suman TVదీంతో కోహ్లీ- అశ్విన్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న విషయం స్పష్టమైంది. కాగా కోహ్లీ మాత్రం ఇలాంటి విషయాలేవి పట్టించుకోకుండా ఆర్సీబీకి ఈసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. కనీసం అశ్విన్‌ అయినా దీనిపై స్పందించి ఒక వివరణ ఇవ్వడంపై ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.