పాకిస్థాన్‌ అతి ఆత్మవిశ్వాసం.. టీమిండియాపై గెలిచి శుభారంభం చేస్తామంటూ ప్రగల్బాలు

babar azam

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సదండి షురూ అయిపోయింది. అన్నీ దేశాలు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి. అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్‌ వేదికగా పొట్టి క్రికెట్‌ సంబరం ప్రారంభం కానుంది. అక్టోబరు 18, 20 దుబాయ్‌ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలతో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రపంచకప్‌ వేదికగా భారత్‌- పాక్‌ అక్టోబరు 24న తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ టికెట్లు హాట్‌ కేకుల్లా ఒక్క గంటలోనే అమ్ముడైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం మొత్తం క్రికెట్‌ ప్రపంచమే ఎదురుచూస్తోంది. దాయాదుల పోరును చూసేందుకు సిద్ధమవుతున్నారు అభిమానులు.

ఇదీ చదవండి: అభిమానులకు సమంత బిగ్‌ సర్‌ప్రైజ్‌.. ఏం చేయబోతోందంటే?

ఈ మ్యాచ్‌పై భారత్‌ను చిత్తుచిత్తు చేస్తామని, తమ టీమ్‌ ముందు టీమిండియా నిలవలేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా మొదలు ఆ దేశ మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు మొత్తం జబ్బలు చరుచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆ దేశ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ కూడా మరో స్టేట్‌మెంట్‌ పాస్‌ చేశాడు. ‘టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో టీమిండియాపై విజయంతో శుభారంభం చేస్తాం’ అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ను పాకిస్థాన్‌ కట్టడి చేయడం అనేది జరగలేదు. వాళ్లకు సరైన రికార్డ్‌ ఒక్కటీ లేదు. కానీ లేనిపోనీ వ్యాఖ్యలు చేస్తూ నవ్వులపాలు కావడం వారికి అలవాటు అయిపోయింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా- పాకిస్థాన్‌ మ్యాచ్‌ విజయం ఎవరి? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియంజేయండి.