బిర్యాని సెంటర్‌ పెట్టిన టీమిండియా స్టార్‌ బౌలర్‌

Mohammadh Shami as Chef with Balls - Suman TV

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహ్మమద్‌ షమీ బిర్యాని సెంటర్‌ ఓపెన్‌ చేశాడు. అందులో స్పెషల్‌ మెనూ కూడా ఉందంటూ బోర్డు పెట్టాడు. కాకపోతే చికెన్‌, మటన్‌ బిర్యాని కాదు. డాట్‌ బాల్‌ బిర్యాని, ఇన్‌స్వింగ్‌ బిర్యాని, యార్కర్‌ బిర్యాని వంటివి అక్కడ లభిస్తాయి అంటూ షమి ఫేస్‌బుక్‌ అకౌంట్లో ఒక ఫోటో పోస్టు చేశాడు. షమి బిర్యాని సెంటర్‌ పేరుతో ఉ‍న్న ఆ పోస్టర్‌లో షమి చెఫ్‌ వేషంలో ప్లేట్‌లో క్రికెట్‌ బాల్స్‌ పట్టుకుని ఉంటాడు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. మంచి మెనూ కార్డు, ఐపీఎల్‌లో, రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో సర్వ్‌ చేయండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరీ షమి తన బిర్యానిని ఎవరికీ ఇష్టంగా పెడతాడో.. ఏ బ్యాట్స్‌మెన్‌ దాన్ని తింటాడో.