పంజాబ్ కింగ్స్ జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు ఒక చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ పదహారో సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు తమ ప్రయాణాన్ని మరో ఓటమితో ముగించింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ మొత్తం 20 ఓవర్లు ఆడి 5 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. సామ్ కర్రన్ (49), జితేష్ శర్మ (44), షారుక్ ఖాన్ (41) బ్యాటింగ్‌లో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్, స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (50) హాఫ్ సెంచరీతో మరోసారి తన సత్తా చాటాడు. అతడితో పాటు దేవ్‌దత్ పడిక్కల్ (51), షిమ్రన్ హెట్మెయిర్ (46) రాణించడంతో రాజస్థాన్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. పంజాబ్‌పై గెలుపుతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ టీమ్ ఐదో స్థానానికి చేరుకోగా.. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న పంజాబ్.. ఈ ఓటమితో మరో చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. వరుసగా 9 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించిన టీమ్‌గా పంజాబ్ నిలిచింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లలో పంజాబ్ కూడా ఉంది. 2014లో ఫైనల్స్‌కు చేరుకున్న ఈ టీమ్.. కప్ గెలవడంలో ఫెయిల్ అయ్యింది. రన్నరప్‌గా నిలిచిన ఆ సీజన్‌ను మినహాయిస్తే గత తొమ్మిది సీజన్లుగా కనీసం లీగ్ దశను కూడా దాటలేకపోయింది. దీన్ని బట్టే పంజాబ్ కింగ్స్ ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెత్తాటతో వరుస సీజన్లలో విఫలమవుతున్న పంజాబ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో పాటు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ జట్టుకు క్రికెట్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్లో నుంచి ఈ ఫ్రాంచైజీని తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. సీజన్ సీజన్‌కు ఆటతీరులో మరింతగా దిగజారుతున్న పంజాబ్ కింగ్స్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.