ఐపీఎల్-2023లో పంజాబ్ ఓటమితో నిష్క్రమించింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో పంజాబ్ ఓటమి పాలైంది.
ఐపీఎల్-2023 చివర దశకు వచ్చేసింది. ఇంక మరికొన్ని మ్యాచ్ లో మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జట్టులో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్కరమించగా.. తాజాగా ఆ జాబితాలో పంజాబ్ వచ్చి చేరింది. ఐపీఎల్-2023ను పంజాబ్ కింగ్స్ ఓటమితో ముగించింది. శుక్రవారం ధర్శశాల వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. 188 పరుగుల భారీ టార్గెట్ ను కూడా పంజాబ్ కాపాడుకోలేక ఓడిపోయింది. దీంతో పంజాబ్ అభిమానలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. అయితే మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించారు.
శిఖర్ ధావన్ మాట్లాడుతూ..”ఫీల్డింగ్ తప్పిదాల వల్లే మేము ఓడిపోయాము. పవర్ ఫ్లేలో మేము వెంట వెంటనే వికెట్లు కోల్పోయాము. అది మమ్మల్ని బాగా వెనక్కి నెట్టింది. అయితే జితేష్, కుర్రాన్, షారుఖ్ తమ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో జట్టుకు మంచి స్కోర్ అందించారు. వీరి ఆటతో మళ్లీ మేము మ్యాచ్ లో పుంజుకున్నాము. మా బౌలర్లు కూడా బాగానే రాణించారు. కానీ ఫీల్డింగ్ మాత్రమే నిరాశపరించింది. సులభమైన క్యాచ్ లను జారవిడవడం మా కొంపముంచింది. ఈ పిచ్ పై కనీసం 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అవుతుంది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో క్లిక్ అయి.. విఫలమయ్యాము. మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. మేము ఈ సీజన్ ను ఓటమితో ముగించినప్పటికి.. చాలా విషయాలు నేర్చుకున్నాము. మేము కొన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించాము” అని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 187 పరులుగు చేసింది. సామ్ కరన్(49 నాటౌట్), జితేశ్ శర్మ 44 పరుగులు, షారుఖ్ ఖాన్ 23 బంతుల్లో 41 పరుగులతో మెరిశాడు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిగిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. హెట్ మయర్ 28 బంతుల్లో 46, పడిక్కల్ 51 పరుగులు, జైస్వాల్ 51 పరుగులు చేశారు. చేధన ఆరంభంలో రాయల్స్ దెబ్బతింది. ఓపెనర్ బట్లర్ వరుసగా మూడో మ్యాచ్ లో డకౌటయ్యాడు. కానీ మరో ఓపెనర్ జైస్వాల్ పడిక్కల్ చక్కని బ్యాటింగ్ తో రాజస్థాన్ ను విజయ తీరాలకు చేర్చారు.