ఐపీఎల్ పదహారో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసుకు దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ టీమ్ ఎప్పటిలాగే మరోమారు నిరాశపర్చింది. అయితే ఒక విషయంలో మాత్రం చెన్నై కంటే పంజాబ్ ఎంతో మెరుగ్గా ఉంది.
ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయిన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. పదహారో సీజన్లో అయినా ఆ జట్టు తలరాత మారుతుందేమోనని అనుకుంటే మళ్లీ పాత పాటే. కప్ మాట దేవుడెరుగు.. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వడమే ఆ టీమ్‌కు గొప్ప అన్నట్లుగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన పంజాబ్ ఓటమితో సీజన్‌ను ముగించింది. ఈ ఓటమితో వరుసగా 9 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాకుండానే నిష్క్రమించిన టీమ్‌గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది పంజాబ్. ఒక్క ఐపీఎల్-2014ను మినహాయిస్తే మిగతా అన్ని సీజన్లలోనూ ఆ జట్టు దారుణంగా ఫెయిలైంది. 2014లో పంజాబ్ ఫైనల్స్‌కు చేరుకున్నా.. తుదిమెట్టుపై బోల్తాపడి రన్నరప్‌గా నిలిచింది. గత తొమ్మిది సీజన్లుగా పంజాబ్ కనీసం లీగ్ దశను కూడా దాటలేకపోతోంది.
వరుస సీజన్లలో చెత్తాటతో ప్రేక్షకులతో పాటు అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న పంజాబ్ కింగ్స్.. ఒక విషయంలో మాత్రం సూపర్బ్ అనిపించుకుంటోంది. లోకల్ ప్లేయర్లను ప్రోత్సహించడంలో ఆ జట్టు ముందుంది. ఈ సీజన్లో పంజాబ్‌కు ఆడిన అన్క్యాప్డ్ ప్లేయర్లు బాగా రాణించారు. వాళ్లందరూ కలసి ఏకంగా 1,255 రన్స్ కొట్టారు. దీంతో ఐపీఎల్‌లోని టీమ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో పంజాబ్ కింగ్స్ టాప్‌లో నిలిచింది. తర్వాతి ప్లేసులో రాజస్థాన్ రాయల్స్ (856), కోల్‌కతా నైట్‌రైడర్స్ (589), సన్‌రైజర్స్ హైదరాబాద్ (580) ఉన్నాయి. అయితే ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (0 రన్స్)తో ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. అన్ని విషయాల్లో టాప్‌గా ఉండే సీఎస్కే ఈ ఒక్క విషయంలో మిగతా అన్ని టీమ్స్ కంటే దిగువన ఉంది. ఇకపోతే, అథర్వ టైడే లాంటి పలువురు పంజాబ్ అన్క్యాప్డ్ ప్లేయర్లు ఈ సీజన్లో అద్భుతంగా రాణించారు. అందుకే ఈ లిస్టులో పంజాబ్ టాప్కు చేరుకుంది.
Runs scored by uncapped players of each team. pic.twitter.com/s0FoWXLHxV
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 22, 2023