ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి తేదీలు ఖరారు! ఎప్పుడంటే..?

IPL Mega Auction

క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించే ఐపీఎల్‌ గురించి మరో ముఖ్యమైన అప్డేట్‌ వచ్చేసింది. ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 8 జట్లు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా.. ఇతర ఆటగాళ్లు ఈ వేలంలో అందుబాటులో ఉంటారు. రెగ్యులర్‌గా ఉండే 8 జట్లతో పాటు మరో రెండు జట్లు సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్‌జీ గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంఛైజీ, సీవీసీ కేపిటల్‌ కు చెందిన అహ్మదాబాద్‌ ఫ్రాంచైజ్‌ కొత్తగా వేలంలో పాల్గొననున్నాయి. కాగా ఈ మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా నిర్వహించనున్నట్లు ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించారు.

రెండు కొత్త ఫ్రాంచైజ్‌లకు ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్’ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ‘రెండు బిడ్‌లను గవర్నింగ్ కౌన్సిల్‌ ఆమోందించింది. దీనికి సంబంధించిన ఎల్‌ఐవోను త్వరలోనే జారీ చేస్తాం. దీనివల్ల మెగా వేలానికి ముందే ఈ రెండు జట్లు తమ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది’ అని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించారు. మరి మెగా ఆక‌్షన్‌లో ఏ ఆటగాడు అధిక ధర పలుకుతాడో.. ఏ ఫ్రాంచైజ్‌ స్ట్రాంగ్‌ టీమ్‌ను నిర్మిస్తుందని మీరు భావిస్తున్నారు?.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ గా తప్పుకున్న చైనీస్‌ మొబైల్‌ కంపెనీ! రంగంలోకి టాటా!