రవీంద్ర జడేజా పై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్ వాన్ ప్రశంసలు

england former captain michael

ఐపీఎల్‌-2021 సెకండ్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. ఇక ఈ జట్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు యంగ్ ఆండ్ డైనమిక్ క్రికెటర్ రవీంద్ర జడేజా. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటు బ్యాటింగ్, ఫిల్డింగ్, బౌలింగ్ అని తేడా లేకుండా తన పదునైన ఆట తీరుతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక తాజాగా జడేజాపై మరోసారి ప్రశంసలు కురిపించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్.

england former captain michaelతాజాగా ఓ క్రీడ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన జడ్డు ఆట తీరుపై కితాబిచ్చారు. రవింద్ర జడేజా అద్భుతమైన ఆటగాడు. పిచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పరుగులు రాబట్టగల క్రికెటర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫిల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించగల సత్తా ఉన్న అల్ రౌండర్ ఆటగాడంటూ అతనిపై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ఇక ఇదే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు సిసలైన టీ20 క్రికెటర్ జడేజే అని వాన్ అన్నారు. మంచి టీ20 క్రికెటర్ ని తయారు చేయాలంటే ఉదహారణకు రవీంద్ర జడేజాను తీసుకోవచ్చంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడీ ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్ వాన్. ఇక రవింద్ర జడేజాపై మైఖెల్ వాన్ చేసిన అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.