కెప్టెన్సీ మార్పు వార్తలను కొట్టిపారేసిన బీసీసీఐ

BCCI

పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకోనున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత రోహిత్‌ శర్మ బాధ్యతలు స్వీకరిస్తాడు. కోహ్లీ తన బ్యాటింగ్‌, ఫామ్‌పై దృష్టి సారించేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారాలు జరిగాయి. మీడియాలో వార్తలు వచ్చేశాయి. అవన్నీ తప్పుడు ప్రచారాలని బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమల్‌ స్పష్టం చేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అన్ని ఫార్మాట్లకు విరాట్‌ కోహ్లీనే కెప్టెన్‌గా ఉన్నాడని.. ఉంటాడని చెప్పారు.

‘ఇదంతా మీడియాలో జరుగుతున్న ప్రచారాలు మాత్రమే. కెప్టెన్సీ స్ప్లిట్‌ చేయడంపై బీసీసీఐ చర్చించలేదు, ఆ ఆలోచన కూడా లేదు. అన్ని ఫార్మాట్లకు విరాట్‌ కోహ్లీనే కెప్టెన్‌గా ఉంటాడు’ అని స్పష్టం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓటమి తర్వాత నుంచి కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు. ఫైనల్‌ మ్యాచ్‌లో టీమ్‌ సెలక్షన్‌ను కూడా తప్పుబట్టినట్లు వార్తలు వినిపించాయి. అరుణ్‌ ధుమల్‌ మాత్రం అలాంటి సమావేసం జరగలేదని తెలిపారు.