ఐపీఎల్‌ కు ధోనీ వీడ్కోలు! హెడ్‌ కోచ్‌ గా చూడబోతున్నామా?

jadeja dhoni

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌లో వరుస విజయలాతో ఫుల్‌ జోష్‌తో ఉంది. పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఎప్పటిలాగే కెప్టెన్‌ కూల్‌ ప్రణాళికలు, వ్యూహాలు సీఎస్కేకి బాగా కలిసొస్తున్నాయి. గత సీజన్‌లో అంతంత మాత్రంగానే ఆడిన చెన్నై.. ఇప్పుడు దుమ్ము దులిపేస్తోంది. సీఎస్కే అభిమానులకు ఒక్క బాధ మాత్రం వెంటాడుతోంది. కెప్టెన్‌ విజయాలు అందిస్తున్న ధోనీ వ్యక్తిగత ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌ అభిమానులు హెలికాప్టర్‌ టేకాఫ్‌ను మిస్‌ అవుతున్నారు. ఈ అంశం మీదే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ ‘బ్రాడ్‌ హాగ్‌’ యూట్యూబ్‌ ఛానల్‌లో అభిప్రాయాలు తెలియజేశాడు.

వచ్చే సీజన్‌లో వీడ్కోలు

ఆదివారం కోల్‌కతాపై జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించినా.. ధోనీ మాత్రం బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. ఎంఎస్‌ ధోనీని వరుణ్‌ చక్రవర్తి బౌల్డ్‌ చేశాడు. గతంలోనూ ధోనీ ఇలాగే వరుణ్‌ చక్రవర్తికి దొరికాడు. మళ్లీ అదే తప్పు రిపీట్‌ చేయడంతే అందరూ ధోనీ బ్యాటింగ్‌పై విమర్శలు, విశ్లేణలు మొదలు పెట్టారు. ధోనీ(40) వయసు పెరుగుతున్న రీత్యా ఇంక ఆటకు వీడ్కోలు పలికితే బావుంటుందని బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయ పడ్డాడు. బహుశా వచ్చే సీజన్‌ నుంచి ధోనీ ఐపీఎల్‌ నుంచి కూడా తప్పుకుంటాడని తనకు అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ‘ఈ ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని భావిస్తున్నా. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ధోని ఔటైన విధానం చూశాం. 40 ఏళ్ల ధోని అలసిపోతున్నాడేమో?. సారధిగా ధోనీ విజయాలు సీఎస్‌కేతో పాటు టీమిండియాకి కూడా ఉపయుక్తంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. వయసు మీద పడుతున్న కొద్దీ ధోనీ వ్యక్తిగతంగా రాణించలేకపోతున్నాడు అనిపిస్తోంది. రిటైర్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

dhoniహెడ్‌ కోచ్‌గా ధోనీ..

‘రాబోయే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియాకి ధోనీ మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత సీజన్‌లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికితే కచ్చితంగా సీఎస్కేకి హెడ్‌ కోచ్‌గా మారచ్చు. లేదంటే ధోనీ సీఎస్కే యాజమాన్యంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. హెడ్‌కోచ్‌ అయితే స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌తో కలిసి సీఎస్కేకి మంచి పునాదులు వేసే అవకాశం లేకేపోలేదు’ అని బ్రాడ్‌ హాగ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ధోనీ తర్వాత కెప్టెన్‌గా ఎవరు ఉండాలన్న దానిపై కూడా ప్రస్తావించిన హాగ్‌.. ధోనీ తర్వాత రవీంద్ర జడేజా సీఎస్కే జట్టు కెప్టెన్‌గా అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ పడ్డాడు.