జగన్ రెడ్డి రక్షక గోవిందా అంటూ వైవీ. సుబ్బారెడ్డి సతీమణి స్తోత్రాలు! వీడియో వైరల్!

jagan

తిరుముల భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఆ దేవ దేవుని సన్నిధిలో ఆపద మొక్కుల వారి కీర్తన తప్ప, ఆయన నామ స్మరణ ఇంకెవ్వరిని పూజించకూడదు. శృతించకూడదు. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. అయితే.., ఇప్పుడు అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో.. రాష్ట్ర సీఎం సాక్షిగా తిరుములలో అపచారం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తులాభారం మొక్కును చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో జగన్ 78 కేజీల బియ్యం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పట్టు వస్త్రాలతో హాజరైన సీఎం.. ఎంతో భక్తి శ్రద్దలతో తన మొక్కుని తీర్చుకోవడం విశేషం. అయితే.. ఈ సమయంలో టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత కాస్త బిగ్గరగా గోవింద నామ స్మరణ చేశారు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చకి కారణం అయ్యింది.

jagan“ఏడు కొండలవాడ గోవిందా, వెంకట రమణ గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా అంటూనే.. జగన్ రెడ్డి రక్షక గోవిందా అని నోరు జారేశారు స్వర్ణలత. ఆమె పొరపాటుగా నోరుజారి అలా అనేశారో, లేదా ఇంకేమైనా అర్ధంతో అలా అనేశారో తెలియదు గాని, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీఎం జగన్ మోహన్ రెడ్డి పిన్ని స్వర్ణలత జగన్ పై తన తల్లి ప్రేమని.. ఈ విధంగా తిరుముల క్షేత్రంలో స్వామివారి నామాన్ని జపించే సమయంలో వ్యక్తం చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.