నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ కి నిరసన సెగ

Bandi Sanjey Nalgonda Bjp Telangana

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి నిరసన సెగ తగిలింది. అయితే సోమవారం ఉదయం బండి సంజయ్ జిల్లాలోని ఆర్జలబావి ఐకేపీ సెంటర్ వద్ద నిర్వహించిన రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. ఇక పర్యటనను ముగించుకుని మిర్యాలగూడ వైపు వెళ్తున్న సంజయ్ కి టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ కాన్వాయ్ కి ఎదురొచ్చి గో బ్యాక్ బండి సంజయ్ అంటూ కార్యకర్తలు నినాదలు చేశారు.

ఇక వీరికి పోటీగా బీజేపీ కార్యకర్తలు సైతం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ఇరువురి కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఇదే క్రమంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంతటితో ఆగకుండా బండి సంజయ్ కాన్వాయ్ పై గోడిగుడ్లతో దాడికి దిగారు. ఇక దీనిపై స్పందించిన నల్లగొండ జిల్లా బీజేపీ కార్యకర్తలు నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై నిరసనకు దిగారు.