ఈ మద్య తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారలు పెద్ద దుమరారం రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పూర్తి కాకముందే.. టెన్త్ తెలుగు, హిందీ పేపర్లు లీక్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ కేసులో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
తెలంగాణలో టెన్త్ హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా ఉన్న బండి సంజయ్.. బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్ రంఘనాథ్ పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా వరంగల్ సీపీ రంగనాథ్ పై పలు సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. తాజాగా తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు వరంగల్ సీపీ రంగనాథ్. అంతేకాదు తానపై చేసిన ఆరోపణలు నిరూపించాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు సీపీ రంగనాథ్.
ఎంపీ స్థాయిలో ఉన్న తనపై నిరాధార ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన వరంగల్ సీపీ రంగనాథ్ వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. అంతేకాదు తాను సెటిల్మెంట్ చేసినట్లు నిరూపించాలని ఛాలెంట్ విసిరారు. తనపై బండి సంజయ్ ఎన్నో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసన్నారు. కొన్ని కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తే కొంతమందికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.. అందుకే ఏది పడితే అది కామెంట్స్ చేస్తుంటారు. ఎంతమంది ఎన్ని అన్నా.. తన బాధ్యత నిర్వహించక తప్పదు అన్నారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదు.. తప్పు చేసిన ఎవరినీ పోలీసులు వదిలే ప్రసక్తే లేదు.
రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాను.. నేను ఏ రాజకీయ నాయకులకు వత్తాసు పలకను… తనపై ఆరోపణలు రుజువు చేస్తే నిర్మోహమాటంగా రాజీనామా చేస్తానని సీపీ స్పష్టం చేశారు. ఇక సత్యం బాబు కేసు విషయంలో తనపై ఆరోపణలు చేస్తున్నారు.. కానీ వాస్తవానికి ఆ కేసును తాను హ్యాండిల్ చేయనేలేదు అని రంగనాథ్ స్పష్టం చేశారు. ఆ కేసులో తాను విచారణ అధికారి కాదని.. కేవలం స్పెషల్ ఆఫీసర్ గా నందిగామకు పంపించారని రంగనాథ్ వెల్లడించారు. ప్రతి కేసులోనూ ప్రమాణాలు చేసుకుంటూ వెళ్లాలంటే.. నేను పది వేల సార్లు ప్రమాణాలు చేయాలని అన్నారు. బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం అన్నారు.