కృత్రిమ గర్భం కోసం వీర్యదానం చేసే వ్యక్తిని నేరుగా ఇంటికి పిలిపించి..

స్పెషల్ డెస్క్– ఈ కాలంలో చాలా మంది జంటలు పిల్లలు పుట్టక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పిల్లల కోసం ఎంతో మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వైద్యరంగంలో ఆధునిక పద్దతుల రావడంతో కృత్రిమ గర్భధారణ వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఐతే కృత్రిమ గర్భధారణ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కొంత మంది ఈ ఖర్చును భరించినా, చాలా మందికి అంత స్థోమత ఉండదని చెప్పవచ్చు.

ఇదిగో ఇక్కడ బ్రిటన్ కు చెందిన ఓ మహిళ ఇలా కృత్రిమ గర్భం కోసం ఆస్పత్రి ఖర్చులు భరించలేక, వినూత్నంగా ప్రయత్నించింది. చాలా సింపుల్ గా గర్భం దాల్చి అందరిచేత ఔరా అనిపించింది. బ్రిటన్ కు చెందిన 33 ఏళ్ల స్టెఫానీ టేలర్‌కు భర్తతో గొడవల కారణంగా అతడి నుంచి విడిపోయింది. అప్పటికే ఆమెకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. అతడు ఇలా ఒంటరిగా పెరగడం ఆమెకు ఇష్టం లేదు. అలాగని ఇష్టం లేని వ్యక్తితో కలిసుండటం కూడా ఆమెకు ఇష్టం లేదు.

Birth 2

అందుకే కృత్రిమ గర్భదారణ ద్వారా సంతానం పొందాలని స్టెఫానీ టేలర్‌ డిసైడ్ అయ్యింది. ఐతే ప్రైవేటు ఆస్పత్రుల వాళ్లు కృత్రిమ గర్భం కోసం చెప్పిన ఖర్చు విని ఆమెకు మైండ్ బ్లాంక్ అయ్యింది. కృత్రిమ గర్భధారణ కోసం ఏకంగా 1600 పౌండ్ల కర్చు అంటే మన ఇండియన్ కరెన్సీలో 1లక్షా 60 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియడంతో తీవ్ర నిరాశ చెందింది.

దీంతో తానే స్వయంగా కృత్రిమ గర్భధారణ చేసుకోవాలని స్టెఫానీ టేలర్‌ నిర్ణయించుకుంది. వెంటనే యూట్యూబ్‌, ఇంటర్నెట్ ద్వారా కృత్రిమ గర్భధారణ పద్ధతిపై అధ్యయనం చేసింది. ఆ తరువాత ఓ యాప్ ద్వారా విర్యదాతను సంప్రదించింది. అతడు నేరుగా ఆమె ఇంటికి వచ్చి వీర్యాన్ని ఇచ్చి వెళ్లిపోయాడు.

ఆ తరువాత ఈబేలో కృత్రిమ గర్భధారణ కిట్‌ను ఆర్డర్ అచ్చి తెప్పించుకుంది. ఇంకేముంది యూట్యూబ్‌లో చూపించిన విధంగా కృత్రిమ గర్భధారణ ప్రక్రియను తానే స్వయంగా పూర్తి చేసుకుంది. అంతే మరి తాజాగా ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తన కూతురు అసలు సిసలైన ఆన్‌ లైన్ చిన్నారి అంటూ స్టెఫానీ టేలర్‌ సంబరపడిపోయింది.