స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 350 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 380 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,850.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,840.
1కిలో వెండి 65,100
బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 35 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 38 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 350 రూపాయలు పెరిగి 43 వేల 850 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 380 రూపాయలు పెరిగి 47 వేల 840 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 1300 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 65 వేల 100 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 140 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 150 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 100 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,110 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45 వేల 360 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46 వేల 360 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46 వేల రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,180 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.