స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 170 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,600.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,560.
1కిలో వెండి 64,900
బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 17 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగి 43 వేల 600 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 170 రూపాయలు పెరిగి 47 వేల 560 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 100 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 64 వేల 900 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 250 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 270 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 43 వేల 920 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47, 910 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45 వేల 690 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46 వేల 690 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 45,910 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,090 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.