ఈరోజు బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు, కాస్త తగ్గిన వెండి

బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,990.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,990.
1కిలో వెండి 67,800

బిజినెస్ డెస్క్-  ఈ రోజు సోమవారం బంగారం ధరలో మార్పు లేదు. మంగళవారంతో 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 43 వేల 990 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 47 వేల 990 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 200 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 800 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 510 రూపాయలు తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 560 రూపాయలు తగ్గింది.

Gold 1 2

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 390 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,390 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,070 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,070 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,140 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,340 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.