ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళ కడుపులో దూది మరిచి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఇక వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బూచన్ పల్లిలో శ్రీలత అనే యువతి గత కొంత కాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో శ్రీలత కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు.
ఇక టెస్టులు చేసిన వైద్యులు ఆపరేషన్ ప్రారంభించారు. వైద్యుల ఆపరేషన్ లో మాత్రం శ్రీలత కడుపులో భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. మూడు కిలోల బరువుతో కూడిన వెంట్రుకల గడ్డ బయటపడింది. దీంతో వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు శ్రీలత కడుపులో ఉన్న వెంట్రుకల గడ్డను బయటకు తీశారు. దీంతో శ్రీలత ప్రాణాలతో బయటపడి ఇప్పుడు క్షేమంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీలత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.