సాయి ధరమ్‌ తేజ్‌ రేసింగ్‌ వార్తలపై పోలీసులు ఏమన్నారంటే?

sai dharma tej

సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్‌ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రీట్‌మెంట్‌కు తేజ్‌ బాగానే స్పందిస్తున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ కుడి చేతిని కదిలిస్తూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. కళ్లు తెరవలేదు కానీ ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఇప్పిటకే మెగా ఫ్యామిలీ అంతా పరామర్శించారు. ఎలాంటి ప్రమాదం లేదని అల్లు అరవింద్‌, చిరంజీవి ఇప్పటికే అభిమానులకు స్పష్టం చేశారు. కాగా, తాజాగా సాయి ధరమ్ తేజ్‌, ప్రముఖ నటుడి కుమారుడు ఇద్దరూ రేసింగ్‌కు పాల్పడ్డారని వార్తులు వినిపిస్తున్నాయి. అలాంటి వార్తలపై పోలీసులు స్పందించారు.

సాయిధరమ్‌ తేజ్‌, అతని మిత్రుడు రేసింగ్‌ పెట్టుకుని ప్రమాదానికి గురైనట్లు వచ్చిన వార్తలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు. అవన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా రేసింగ్‌కు సంబంధించిన ఆనవాలు లేవన్నారు. అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లలో సాయితేజ్‌ ఒక్కడే ఉన్నట్లు తెలిపారు. సాయిధరమ్‌ తేజ్‌ ఆటోను ఓవర్‌టేక్‌ చోయబోతుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఓవర్‌టేక్‌ చేసే సమయంలో అక్కడ ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యిందని స్పష్టం చేశారు.