టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రిమ్ హీరో సాయిధరమ్ తేజ గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. వారి మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మెగా అభిమానులతో పాటు సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. వారి మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మెగా అభిమానులతో పాటు సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా మెగా ఫ్యామిలి నుంచి వచ్చి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. అయితే రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది.. తిరిగి మాములు స్థితికి వచ్చాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన సాయి ధరమ్ తేజ్..బైక్ యాక్సిడెంట్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. అలానే ఆ ప్రమాదం కారణంగా తాను శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడో వివరించాడు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..” ఈ ప్రమాదం జరిగిన తరువాత నాకు మాట విలువ ఏంటో తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు నేను షాక్ కి గురయ్యాను. దీంతో మాట కూడా పడిపోయింది. అయితే జనాలకి నాకు మాటపడిపోయిన విషయం తెలియదు. దీంతో వీడేంటి తాగేసి మాట్లాడుతున్నాడా? అంటూ జోకులేసుకున్నారు. కానీ మాట రావడం కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. మాటలు రాలేదని ఎంతో బాధ పడ్డాను. నేను చిన్నతనం నుంచి ఎక్కువగా మాట్లాడే వాడిని. అలాంటి నాకు ఒక్కసారిగా మాటలు రాకపోవడంతో చాలా మానసిక వేదనకు గురయ్యాను.
మాట్లాడటం అనేది ఎంత సంతోషాన్ని ఇస్తాదో, ఎంతో ముఖ్యమో ఈ ప్రమాదం ద్వారా తెలుసుకున్నాను. నా చుట్టు పక్కల ఉండే వారు నా కోసం ఎంతో ఓర్పుగా ఉన్నారు. నేను మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓపికగా నా మాటలు వినేవారు. అర్థంకాకుంటే.. అర్థం కాలేదు మరోసారి చెప్పు అని మరీ నా చేత మాట్లాడించే వాళ్లు. అలానే నా సినిమాల డైరెక్టర్లు, నాతోటి నటీనటులు నాకు చాలా మద్దతుగా నిలబడ్డారు. రిపబ్లిక్ సినిమాలో నాలుగు పేజీల డైలాగ్స్ ను ఎంతో ఈజీగా చెప్పాను. ఈ ప్రమాదం తరువాత సగం పేజీ డైలాగ్ చెప్పడానికి కూడా మాట వచ్చేది కాదు. అలాంటి సమయంలో నాతోటి యాక్టర్స్, నాకు చాలా సపోర్టుగా ఉన్నారు. ఎక్కువ ఇబ్బంది పడొద్దంటూ ధైర్యం ఇచ్చారు.
90 వేసి వచ్చాడా అంటూ కొందరు నాపై జోక్స్ వేశారు. అయితే ఆ మాటల విలువ వాళ్లకి తెలియదు. వాళ్లకి ఆ మాటలు కేవలం జోక్స్ లాగానే ఉంటాయి” అంటూ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ అనే పాన్ ఇండియా సినిమా చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అవుతుంది. దీనికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. మరి.. సాయిధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.