సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అప్పట్లో రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, తీవ్ర గాయాలపాలైన ఆయన.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన విషయం విదితమే. అయితే ఆ ప్రమాదంలో సాయి తేజ్ ప్రాణాలు కాపాడిన అబ్దుల్ ఫర్హాన్‌కు సంబంధించి ఒక వివాదం నడుస్తోంది.
సాధారణ ప్రజల్లాగే సినీ తారల జీవితాల్లోనూ కష్టసుఖాలు ఉంటాయి. సామాన్యులు ఎదుర్కొన్నట్లే వాళ్లు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మామూలు మనుషులకే కాదు.. సెలబ్రిటీలు కూడా అనుకోని ప్రమాదాల బారిన పడటాన్ని చూస్తున్నాం. అలా ప్రమాదాల బారిన పడినవారిలో టాలీవుడ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు. రోడ్ యాక్సిడెండ్లో ఆయన తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. చావు అంచుల దాకా వెళ్లిన తేజ్‌ను అబ్దుల్ అనే వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరైన టైమ్‌లో ట్రీట్మెంట్ అందించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అబ్దుల్ గురించి గత కొన్ని రోజులగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రమాదం నుంచి ప్రాణాలతో కాపాడిన అబ్దుల్‌కు సాయి ధరమ్ తేజ్ సాయం చేశారని ప్రచారం జరుగుతోంది.
అబ్దుల్ ఫర్హాన్‌కు కృతజ్ఞతగా లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు కారు, బైక్, ఇల్లు గిఫ్ట్‌గా ఇచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ‘విరూపాక్ష’ మూవీ ప్రమోషన్స్‌లో అబ్దుల్ గురించి తేజ్ మాట్లాడారు. సాయం చేసిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవాలని అనుకోవడం లేదన్నారు. అతడికి తన కాంటాక్ట్ నంబర్ ఇచ్చి అండగా ఉంటానని హామీ ఇచ్చానన్నారు. అయితే దీనిపై మీడియా అబ్దుల్‌ను కలసి మాట్లాడగా.. తనను సాయి తేజ్ లేదా మెగా కుటుంబం నుంచి ఎవరూ కలవలేదన్నారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ ఫోన్ చేయలేదని అబ్దుల్ బదులిచ్చాడు. దీంతో సాయి ధరమ్ తేజ్‌ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా ఈ కాంట్రవర్సీపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. తన మీద, తన టీమ్ మీద కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అబ్దుల్ ఫర్హాన్‌కు ఆర్థికంగా సాయం చేసినట్లు తాను కానీ, తన టీమ్ కానీ ఎక్కడా చెప్పలేదని సాయి తేజ్ స్పష్టం చేశారు. అబ్దుల్ తనకు చేసిన సాయానికి తాను, తన కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. అతడి వివరాలు తమ దగ్గర ఉన్నాయని.. అబ్దుల్ ఫర్హాన్ ఎప్పుడైనా మేనేజర్ ద్వారా తనను కలవొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కాంట్రవర్సీ మీద ఇదే తన చివరి స్పందన అని సాయి తేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇకపోతే, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్లలో ఊపును చూస్తుంటే ఆయన కెరీర్లో ఈ మూవీ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
To whomsoever it may concern..
Thank You
Sai Dharam Tej. pic.twitter.com/qJr3SYYJ6B
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 27, 2023