సముద్రం ఒడ్డున వింత ప్రాణి.. అదేంటో తెలియక జనమంతా

ఇంటర్నేషనల్ డెస్క్ ఈ భూమ్మీద కోట్లాది ప్రాణులు ఉన్నాయి. అందుకో కొన్ని మాత్రమే మనకు తెలుసు. భూమ్మీద ఉన్న ప్రాణుల్లో అత్యధికంగా సముద్రంలో ఉంటాయని అందరికి తెలుసు. సముద్రాల్లో ఉండే ప్రాణులు కూడా మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. మనిషికి తెలియని, కనిపించని మరెన్నో ప్రాణులు ఉండగా, వాటిని తెలుసుకునేందుతు నిరంతర ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి.

ఇక కొత్తగా కనిపించే కొన్ని ప్రాణులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయా ప్రాణుల ఆకారం, రూపం, బరువు.. ఇలా ఎన్నో అంశాలు వింతగా ఉంటాయిి. తాజాగా ఆస్ట్రేలియా, క్వీన్స్‌ ల్యాండ్‌ లో ఇలాంటి ఓ వింత ప్రాణి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఆ ప్రాణి ఏమై ఉంటుందా అని అంతా ఆలోచనలో పడ్డారు. క్విన్ ల్యాండ్ లోని ఓ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన గోధుమ రంగులో ఉన్న ఓ ప్రాణి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

veriety 2

అలా సముద్రం ఒడ్డున తేలిన ఆ ప్రాణి ఎంటో తెలియక అధికారులే కాదు స్థానికులు కూడా జుట్టు పీక్కింటున్నారు. స్థానిక యెప్పూన్‌ లోని కెంప్ బీచ్‌ లోకి కొట్టుకొచ్చిన ఈ ప్రాణి సీ టమాటో జెల్లీఫిష్, బ్లోబ్ ఫిష్‌ లా కనిపిస్తోంది. అంతే కాదు సొరచేప గుడ్ల ముద్ద పోలికలు కూడా కనిపిస్తున్నాయి. అస్ట్రేలియా వన్యప్రాణి నిపుణులు సైతం ఈ వింత ప్రాణి ఏమై ఉంటుందన్న దానిపై ఎటూ చెప్పలేకపోతున్నారు.

ఎవరికి తోచిన విధంగా వారు ఏదో ఒకటి చెబుతున్నా, ఖచ్చితంగా ఈ ప్రాణి ఏంటన్నది మాత్రం ఎవరు చెప్పలేపోతున్నారు. సముద్ర నిపుణుడు డాక్టర్ లిసా గెర్షివిన్ మాత్రం అది మేన్ సైనేయా బార్కేరి జెల్లీ ఫిష్ అని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ వింత ప్రాణిని చుసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుండటంతో సర్వత్రా ఆసక్తినెలకొంది.