ఏ బొక్క దొరికితే ఆ బొక్కలోకి.. పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్- శ్రీ రెడ్డి.. ఈ టాలీవుడ్ నటి తన ప్రత్యర్ధులపై ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై అర్ధనగ్న ప్రదర్శన ద్వార సంచలనం రేపిన శ్రీరెడ్డి ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఒంటికాలుపై లేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం దొరికినా పవన్ పై ఫైర్ అవుతుంటుంది శ్రీ రెడ్డి.

గతంలో చాలా సార్లు పవన్‌ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు, వ్యాఖ్యలు చేసి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైంది శ్రీరెడ్డి. ఇదిగో తాజాగా పవన్ కళ్యాణ్ పై అంతకు మించి అన్నట్లుగా కామెంట్స్ చేసిందామె. ఈ సారి పవన్ ను ఏకంగా ఒరేయ్ దద్దమ్మ అంటూ సంబోధించి సంచలనం రేపింది శ్రీ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపధ్యంలో శ్రీ రెడ్డి మరోసారి నోరు విప్పింది. గత కొన్ని రోజులుగా హీటెక్కిన ఏపీ రాజకీయ పరిస్థితులపై కామెంట్ చేసింది. టీడీపీ ఆఫీసులపై వైసీపీ నేతల దాడులు చేయడంతో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుధ్దం జరుగుతోంది.

Sir reddy 1

ఈ క్రమంలో తనకు ఇష్టమైన ఏపీ సీఎం జగన్‌ కు మధ్దతుగా టీడీపీ, జనసేన నేతలపై ఫైర్ అయ్యింది శ్రీ రెడ్డి. ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని నోటికొచ్చిన బూతులు తిట్టడంతో పాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తూ సంచలన కామెంట్స్ చేసింది. నా నోరు ఓపెన్ చేస్తే ఎలాంటి బూతులొస్తాయో పవన్ కళ్యాణ్ గా..ని అడుగు చెబుతాడు అంటూ పట్టాభిపై ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రీ రెడ్డి.

ఈ రోజు పవన్ కళ్యాణ్ గా.. వచ్చి ఆఫీసులపై దాడి చేయడం తప్పు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదు అంటున్నాడు.. ఒరేజ్ దద్దమ్మ.. నువ్వు మొదలు పెట్టావు.. సన్నాసి, దద్దమ్మ అని. నిన్ను చూసే వీడు రెచ్చిపోతున్నాడు.. ఇలాంటి దరిద్రపు బూతు రాజకీయాలు మొదలుపెట్టిందే నువ్వు.. సినిమా ఆడియో ఫంక్షన్లను కూడా మీ పొలిటికల్ ప్రెస్ మీట్లుగా మార్చుకుంటున్నారు.. జగన్ గారిపై బురద జల్లడమే లక్ష్యంగా ఏ బొక్క దొరికితే ఆ బొక్కలోకి వెళ్లి జగన్ గారిపై నిందలు వేయడమే మీ పని.. రౌడీ రాజకీయాలు ఎవరు నడిపిస్తున్నారో తెలియదా.. అంటూ ఏ రేంజ్ లో రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడంది శ్రీ రెడ్డి.