మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrol price

బిజినెస్ డెస్క్- ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. శనివారం ఒక్క రోజు తటస్థంగా ఉన్న చమురు ధరలు ఒక రోజు గ్యాప్ తర్వాత ఆదివారం మళ్లీ పెరిగాయి. మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది తొమ్మిదో సారి. ఇక పెట్రోల్ లీటరకు 24 పైసలు, డీజిల్ లీటరుకు 27 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ 92 రూపాయల 58 పైసకుకి, లీటరు డీజిల్ 83 రూపాయల 32 పైసలకు చేరింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు నగరాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటింది. ఇక ఇప్పుడు పెరిగిన ధరలతో ముంబైలో పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరువైంది. ముంబైలో పెట్రోల్ 98 రూపాయల 88 పైసలకు చేరగా, డీజిల్ 90 రూపాయల40 పైసలకు చేరింది.

diesel

కోల్‌కతాలో పెట్రోల్ లీటరు 92 రూపాయల 67 పైసలు, డీజిల్ 86 రూపాయల 6 పైసలుగా ఉంది, చెన్నైలో పెట్రోల్ 94 రూపాయల 31 పైసలు, డీజిల్ 88 రూపాయల 7 పైసలకు చేరింది, నొయిడాలో పెట్రోల్ లీటరు 90 రూపాయల 45 పైసలు, డీజిల్ 83 రూపాయల 68 పైసలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరు 96 రూపాయల 22 పైసలు, డీజిల్ 90 రూపాయల 73 పైసలకు చేరింది. జైపూర్‌లో లీటరు పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు, డీజిల్ 91 రాపయల 54 పైసలుగా ఉంది, పాట్నాలో పెట్రోల్ లీటరు 94 రూపాయల 79 పైసలు, డీజిల్ 88 రూపాయల 46 పైసలకు చేరింది. ఇక బెంగళూరులో పెట్రోల్ లీటరు 95 రూపాయల 33 పైసలు, డీజిల్ లీటరు 87 రూపాయల 92 పైసలుగా ఉంది. రేపు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.