ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది టూ వీలర్. ఈ రోజుల్లో ఇంటికో టూవీలర్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వాహనదారులను భయపెడుతున్న మరో అంశం పెట్రోల్ ధరలు. బైక్ లో పెట్రోల్ కొట్టించాలంటేనే ఆలోచించే పరిస్థితికి వచ్చారు వాహనదారులు. కానీ ఓ జిల్లాలో పెట్రోల్ బంకులో పెట్రోలును ఉచితంగా అందించిన సంఘటన చోటుచేసుకుంది.

ఆకాశాన్ని తాకుతున్న పెట్రోలు ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. బండిలో పెట్రోలు కొట్టించాలంటేనే గుండెజారినంత పనైతాంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రీగా పెట్రోలు దొరుకుతుందంటే ఎవరు విడిచి పెడతారు చెప్పండి. ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుని మరీ లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తుంటారు. ఇదే విధంగా ఓ బంకులో ప్రీగా పెట్రోలు పోస్తున్నారని తెలిసి వాహనదారులు భారీగా చేరుకున్న సంఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుంకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబసభ్యుని పుట్టినరోజు సందర్భంగా రెండులీటర్ల చొప్పున పెట్రోలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్న విధంగానే రెండు లీటర్ల చొప్పున 150 కూపన్లను బంకు దగ్గర వాహనదారులకు పంచిపెట్టాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోలు బంకుకు క్యూ కట్టారు. వాహనాలు లేనివారు సైతం బాటిళ్లతో క్యూలో నిలబడ్డారు. 150 కూపన్లే అన్న విషయం తెలియక వాహనదారులు పెద్దఎత్తున బంకులోకి ఎగబడ్డారు. కూపన్లు ఉన్నావారికి బంకు సిబ్బంది రెండు లీటర్ల పెట్రోలును ఉచితంగా పోశారు. అయితే అటుగా వెళ్తున్న వాహనాదారులు బంకులో పెట్రోలు ప్రీగా పోస్తున్నారని తెలిసి బంకు దగ్గర నిల్చుండి పోయారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు బంకు దగ్గర బందో బస్తు ఏర్పాటు చేశారు. భారీగా చేరుకున్న వాహనదారులను అక్కడి నుంచి పంపించేశారు. బర్తుడే సందర్భంగా ఫ్రీగా పెట్రోలు పంచిపెట్టిన వ్యక్తిని పలువురు ప్రశంసించారు.