ఆమెతో కలిసి ఐస్ క్రీం తినాలనుకుంటున్న ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ- జపాన్ రాజధాని టోక్యోలో అట్టహాసంగా ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో భారత అథ్లెట్‌‌ లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. జపాన్‌ లోని టోక్యో వేదికగా జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ ఒలింపిక్స్ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న భారత్ కు చెందిన కొంత మంది స్టార్ క్రీడాకారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వార మాట్లాడారు.

pm modi 3

స్టార్ షెట్లర్ పీవీ సింధుతో మాట్లాడిన ప్రధాని, ఒలింపిక్స్‌ని సక్సెస్‌‌ఫుల్‌ గా ముగించుకుని వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇస్‌క్రీమ్ తిందామనని ప్రామిస్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారంటే.. పీవీ సింధు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసుంటే బాగుండేది.. 2016 రియో ఒలింపిక్స్‌ సమయంలో మీరు ఇస్‌ క్రీమ్‌లు తినకుండా నిషేధించారు.. మరి ఇప్పుడు ఇంకేమైనా నిషేధం పెట్టారా.. ఫర్వాలేదు.. ఒలింపిక్స్‌ని సక్స్‌స్‌ ఫుల్‌గా ముగించుకుని రండి.. మీతో కలిసి ఐస్‌క్రీమ్ తింటాను.. టోర్నీలో కష్టపడండి.. కచ్చితంగా మరోసారి మీరు విజయవంతం అవుతారు.. అని పీవీ సింధుతో అన్నారు.

ప్రధాని మోదీ మాటలకు స్పందించిన పీవీ సింధు.. సార్ ఒక అథ్లెట్‌గా డైట్ విషయంలో కంట్రోల్‌ ఉండాలి.. ఇప్పుడు ఒలింపిక్స్ వస్తున్నాయి.. కాబట్టి నేను ఐస్‌క్రీమ్‌లు తినడం లేదు.. అయితే కొన్ని సార్లు మాత్రమే తింటున్నా.. అంది. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో కోచ్ గోపీచంద్ తనకెంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ని కూడా తిననివ్వలేదని పీవీ సింధు చెప్పిన నేపధ్యంలో ప్రధాని మోదీ ఇప్పుడు ఈ విధంగా అడిగారు. ఒత్తిడికి గురవకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పీవీ సింధుకి సూచించారు ప్రధాని. టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు జులై 24 నుంచి ప్రారంభమవుతున్నాయి.