రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

Work From Home

కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కరోనా ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎక్కువగా కేసులు నమోదవుతున్న జాబితాలో దేశ రాజధాని కూడా ఒకటి. అందుకే సీఎం కేజ్రీవాల్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యలయాలను 50 సామర్థ్యంతో నడిపిస్తున్న ఢిల్లీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి అత్యవసర సేవల విభాగంలోకి రాని అన్ని ప్రైవేటు కార్యాలయాల ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇవ్వాలని ఆదేశించింది. తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా చూసుకోవాలని అన్ని కార్యాలయాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ ఈ ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు 50 శాతం సామర్థ్యంతో పనిచేసిన ప్రైవేటు కార్యాలయాలు కూడా ఇక ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. ప్రైవేటు బ్యాంక్స్‌, అత్యవసర సేవలు అందించే కార్యాలయాలు, బీమా, ఫార్మా, న్యాయవాదులు, మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి మినహాయింపు కల్పించారు.

దేశ రాజధానిలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వారంలో ఢిల్లీలో కేసులు మరింత పెరగచ్చని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో 19 వేలు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.