డీఎస్పీ -మహిళా కానిస్టేబుల్‌ రాసలీలలు!.. అదీ ఓ ఓ చిన్నపిల్ల ఎదురుగా!?

DSP and constable swimming pool video Viral - Suman TV

ఆదర్శంగా ఉండాల్సిన పోలీసు అధికారులే వారి చర్యలతో విమర్శలకు గురవుతున్నారు.  ఈత కొలనులో చిన్నారి ముందు మహిళా కానిస్టేబుల్‌తో అనుచితంగా ప్రవర్తించిన రాజస్థాన్‌కు చెందిన డీఎస్పీ హీరాలాల్ సైనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టుపై గత అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దాడి చేసింది. ఈ సందర్భంగా డీఎస్పీ హీరాలాల్ సైనీ, మరో మహిళా కానిస్టేబుల్‌ అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో డీఎస్పీని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వారితో పాటు మహిళ కుమార్తెగా చెబుతున్న చిన్నారి కూడా ఉంది.

DSP and constable swimming pool video Viral - Suman TVవీరిద్దరికి   సంబంధం ఉందని మహిళా కానిస్టేబుల్ భర్త ఆగస్టు 2 న తన భార్య మరియు ఆర్ పిఎస్ అధికారిపై రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలోని చిటావా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 2001 లో తమ పెళ్లి జరిగిందని ఆరేళ్ల క్రితం ఓ బాబు పుట్టినట్లు చెప్పాడు. 2008 లో ఆమెకు రాజస్థాన్ పోలీసులో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందని ఆ తర్వాతే డీఎస్పీతో పరిచయం ఏర్పడిందని తెలిపాడు.

ఓ చిన్నపిల్ల ఎదురుగా డీఎస్పీ హీరాలాల్ సైనీ, మరో మహిళా కానిస్టేబుల్‌ అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అతడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చసి డీఎస్పీని అరెస్టు చేసినట్లు తెలిపారు.

పూర్తి వివరాలు ఇంకా తెలియరావల్సి ఉంది: