నవజ్యోత్ సింగ్ సిద్ధును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉద్రిక్తత!

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పంజాబ్ శాఖలో నెలకొన్న రాజకీయ గందరగోళం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే తాను ఏ పదవిలో ఉన్నా, లేకపోయినా పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి అండగా ఉంటానని నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఇదిలా ఉంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపుర్ ఖేర్‌లో ఆదివారం కేంద్ర మంత్రి కాన్వాయ్ కారు దూసుకెళ్ల‌డం వ‌ల్ల న‌లుగురు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌రో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘ‌ట‌న‌తో లింకు ఉన్న ఓ జ‌ర్న‌లిస్టు ఇవాళ మృతిచెందారు.

goadga minతాజాగా ఉత్తరప్రదేశ్‌ లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనకు నిరసనగా చండీగఢ్‌లోని పంజాబ్ గవర్నర్ హౌస్ ముట్టడించిన నవజ్యోత్ సింగ్ సిద్ధును పోలీసులు అదులోకి తీసుకున్నారు. సిద్ధుతోపాటు పలువురు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా అదుపులోకితీసుకున్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని.. నింధితలను కఠినంగా శిక్షించాలని నవజ్యోత్ సింగ్ సిద్దు.. గవర్నర్ హౌస్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడంతో చండీగఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సిద్ధూ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్మికులతో కలిసి లఖింపూర్ ఖేరీ ఘటనకు వ్యతిరేకంగా మధ్యాహ్నం 1 గంటల సమయంలో చండీగఢ్‌లోని పంజాబ్ గవర్నర్ హౌస్ వెలుపల అకస్మాత్తుగా చేరుకున్నారు. మరోవైపు ల‌ఖింపుర్ ఖేర్ ఘ‌ట‌న‌లో మృతిచెందిన న‌లుగురు రైతు కుటుంబాల‌కు యూపీ ప్ర‌భుత్వం ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ.45 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్నారు. ల‌ఖింపుర్ ఖేర్‌లో గాయ‌ప‌డ్డ వారికి ఒక్కొక్క‌రికి 10 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు యూపీ స‌ర్కార్ ప్ర‌క‌టించింది. రైతులు ఇచ్చే ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌నున్న‌ట్లు ఏడీజీ ప్ర‌కాంత్ కుమార్ తెలిపారు.