ఘనంగా కోతికి అంత్యక్రియలు.. 1500 మంది హాజరు, ఇద్దరు అరెస్ట్!

సాధారణంగా మనుషులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు.. ఆ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు హజవుతుంటారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. కొంత మంది తమ పెంపుడు జంతువులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కోతి చనిపోవడంతో ఓ ఊరు జనం దానికి శాస్త్రోక్తంగా దహన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాజ్‌ఘడ్ జిల్లాలోని దలుపురా గ్రామంలో డిసెంబర్ 29న కోతి అంత్యక్రియలు నిర్వహించారు. పాడెపై కోతి శవాన్ని ఉంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కొరివి పెట్టారు. ఆ కార్యం పూర్తి చేసిన ఓ వ్యక్తి హిందూ సంప్రదాయం ప్రకారం.. గుండు గీయించుకున్నాడు.

image 1 compressed 55నిజానికి ఆ కోతి గ్రామంలో ఎవ్వరికీ పెంపుడు జంతువు కాదు. అప్పుడప్పుడు ఆ ఊరికి వస్తుండేది. దేశంలోని పలు చోట్ల కోతిని హనుమంతుడితో సమానంగా పవిత్రంగా భావిస్తారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గ్రామస్థులంతా డబ్బులు సేకరించి భోజన కార్యక్రమం కోసం కార్డులు ప్రింట్ చేసి పంచిపెట్టారు. ఆ భోజనాలకు దాదాపు 1500మంది హాజరైనట్లు తెలుస్తుంది.

ఇది చదవండి : చావుకే చుక్కలు చూపాడు.. తలలో మేకులు దిగినా

image 2 compressed 29ఇదిలా ఉండగా కోవిడ్ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే అక్కడ కూడా బహిరంగ సభలు, సమావేశాలు పెట్టకూడదనే ఆంక్షలు ఉన్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి అడ్డుకునేందుక గానూ అమల్లో ఉన్న 144సెక్షన్ ను బ్రేక్ చేశారని కొందరిపై కేసు నమోదైంది. అందులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.