పదేళ్ళుగా గదిలో బందీ – ఆమె ఓ ‘ప్రేమ ఖైదీ!’..

ప్రేమ!… అందరినీ జీవితంలో ఒక్కసారైనా పలకరిస్తుంది. ప్రేమ, పెళ్లి.. తేలికేం కాదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయ్‌. సవాలక్ష సవాళ్లు కాచుకొని ఉంటాయ్‌. అందుకే కడగండ్లను అవలీలగా దాటగలిగితేనే అడుగు ముందుకేయాలి. ఎవరి అండ లేకున్నా బతకగలం అనే భరోసా ఉంటేనే ఎదిరించాలి. హీరోల్లా ఫీలైపోతాం. నిజానికి ప్రేమలో పడినవాళ్లంతా హీరోలు కాదు. ప్రేమలో పడ్డాక.ఎదురయ్యే కష్టాలను అధిగమించి, అందరినీ ఒప్పించి, కొత్త జీవితం మొదలుపెట్టేవాళ్లే నిజమైన హీరోలు, ప్రేమికులు. కేరళలోని పాలక్కడ్‌ జిల్లా నెమ్మర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వింత ప్రేమకథ వెలుగు చూసింది. 2010 ఫిబ్రవరిలో ఓ టీనేజీ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది. అయిరూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత పదేళ్లుగా ఆమె ఎక్కడుందో ఇంట్లోవాళ్లకు తెలియలేదు. పదేళ్ల తర్వాత బయటపడ్డ విచిత్రం ఏమిటంటే పుట్టింటికి సమీపంలో ఉన్న ఓ అబ్బాయి ఇంటి దగ్గరే ఆమె ఉంటోంది. ఆమె అక్కడున్న విషయం అబ్బాయి ఇంట్లోవాళ్లకు కూడా తెలియదట. గత పదేళ్లుగా తాళం వేసి ఉన్న ఓ గదిలో ఆమె నివసిస్తోంది. ఆమె ప్రేమికుడిగా చెబుతున్న యువకుడే యోగక్షేమాలు చూసుకునేవాడని పోలీసులు తెలిపారు.

5bb607f82400005000569988

ఇంకో చిత్రం ఏంటంటే ఆ గదికి అటాచ్డ్‌ బాత్‌రూం కూడా లేదు. గదికి ఉన్న ఓ కిటికీ ద్వారా రాత్రిపూట ఆమె బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకునేది. పగటిపూట ఆ కిటికీ కూడా మూసి ఉండేది. ఆమెకు ఆహారం, ఇతర సదుపాయాలు అన్నీ అతడే సమకూర్చేవాడు. తర్వాత బయటి నుంచి తాళం వేసేవాడు. పదేళ్లు ఇలాగే గడిచాయి. మూడు నెలల కిందట ఆ యువకుడు అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పదేళ్లుగా జరుగుతున్న తతంగంతోపాటు అద్యశ్యమైనది ఒకరు కాదు. అయితే ఆ విచారణలో పట్టుబడింది ఒక్కరు కాదు – ఇద్దరూ … వాళ్ళీ వీళ్ళు అని పోలీసుల విచారణలో బయటపడింది. నెమ్మర సమీపంలోని కుగ్రామం విథాన్‌స్సెరీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. తాము కలిసి జీవించాలని అనుకొంటున్నట్టు యువతి కోర్టుకు తెలపడంతో ప్రేమికుడితో వెళ్లేందుకు ఆమెను అనుమతించారు.