పండగపూట ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ

Railway

సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ శాకిచ్చింది. తాజాగా ప్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ నిర్ణయంతో ప్రయాణికులు షాక్ గురువుతున్నారు. అయితే రైల్వే స్టేషన్ లో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ధరల పెంపు అనేది కరోనా నిబంధనలు పాటించే చర్యలో భాగమేనంటూ కూడా చెప్పుకొచ్చింది. పెరిగిన ఈ ధరలు జనవరి 20 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. రైల్వే శాఖ అసలు ప్లాట్ ఫాం ధరలు ఎంత పెంచిందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 నుంచి 50 వరకు పెంచగా హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో రూ.10 నుంచి 20 వరకు పెంచినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. పెరిగిన ఈ ధరలు సబర్బన్ ప్రయాణికుల మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక సామాన్య ప్రయాణికులు ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌, ఫస్ట్‌ క్లాస్‌, ఏసీ ఎంఈఎంయూ, డీఈఎంయూ, నాన్‌-ఏసీ రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్ల నుంచి సెకండ్‌ క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌, ఫస్ట్‌క్లాసులకు రూ.25 చెల్లించాలి. ఇక దీంతో పాటు రిజర్వ్‌డ్‌ ఏసీ ప్యాసింజర్లు, ఏసీ త్రీ టైర్‌, త్రీ ఏసీ ఎకానమీ, ఏసీ-2 టైర్‌, ఏసీ ఫస్ట్‌ క్లాస్‌, ఈసీ, ఈఏ, ఏసీ విస్టాడమ్‌లపై రూ.50తో పాటు ప్లాట్‌ఫాం టిక్కెట్‌ రూ. 10అదనంగా చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ తాజా ప్రకటనతో తెలిపింది. అయితే తాజాగా పెరిగిన రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.