గుడ్ న్యూస్..భారత్ లోకి మళ్ళీ వస్తున్న టిక్ టాక్

Good news..Tick talk coming back to India - Suman TV

టిక్ టాక్..ఇది సృష్టించిన అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అప్పట్లో ఇండియాలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరి టిక్ టాక్ ఉండాల్సిందే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టిక్ టాక్ ఓ ప్రభంజనం సృష్టించింది. ఈ యాప్ ఉందంటే చాలు..తమలోని టాలెంట్ ను బయటకు తీసేస్తారు. ఇక అన్ని దేశాల్లోని దూసుకుపోతూ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రాంతీయ భాషల్లో కూడా టిక్ టాక్ తన సత్తాను చాటుతు జెండాను ఎగరేసింది. ఇక టిక్ టాక్ వేదికపై సక్సెస్ అయిన వాళ్ళు చాల మందనే చెప్పాలి.

TikTok Is Back in India 01 minటిక్ టాక్ ద్వారా క్లిక్ అయి సినిమాల్లో అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నారు. కానీ దీని వాడకంలో లాభం ఎంతుందో నష్టం కూడా అంతే ఉందని చెప్పాలి. అప్పట్లో దీనిపై తీవ్ర దుమారం రేగుతూ బ్యాన్ చేయాలనే వాదనలు బలంగా వినిపించాయి. దీంతో కొన్ని కారణాల వల్ల భారత ప్రభుత్వం దీనిని బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో టిక్ టాక్ మళ్ళీ వస్తుందని, దీనికి భారత ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతునే ఉంది. ఇక తాజాగా TickTock గా పేరు మార్చుకుని మళ్ళీ భారత వాణిజ్య శాఖకు దరఖాస్తు కూడా చేసుకుందని సమాచారం.

TikTok Is Back in India 02 minఇక పేటెంటు కోరుతూ దరఖాస్తు చేసుకోవడం విశేషం. కాగా దీనిపై భారత ప్రభుత్వం టిక్ టాక్ పంపిన దరఖాస్తును పరిశీలనలో ఉంచిందట. దీన్ని బట్టి చూస్తే టిక్ టాక్ త్వరలో ఇండియాలో మళ్ళీ అల్లరి చేయనుందని తెలుస్తోంది. ఈ వార్తతో టిక్ టాక్ అభిమానులకు కాస్త పండగనే చెప్పాలి. ఇక టిక్ టాక్ భారత్ లోకి అడుగుపెట్టేందుకు ఎన్నో రోజుల నుంచి బేరసారాలు జరుపుతూనే ఉంది. ఇక దీంతో ఎట్టకేలకు అన్ని పరిస్థితులు అనుకూలిస్తే త్వరలో భారత్ లోకి అడుగుపెట్టేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.