'టిక్‌టాక్' ప్రస్తుతానికి ఈ యాప్ పై దేశంలో నిషేధం ఉన్నా.. ఒకప్పుడు దీనిదే హవా. తమలో ఉన్న టాలెంట్ సమాజానికి తెలిసేలా చేయడానికి ఇదొక సరైన వేదిక. పగలు, రాత్రి అన్న తేడాలేకుండా అందరూ టిక్‌టాక్ రీల్స్ చేస్తూ సమయాన్ని గడిపేవారు. అయితే.. దేశంలో దీనిపై నిషేధం విధించాక కనుమరుగై పోయింది. కానీ, అమెరికాలో..
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ కు ఉన్న ఆదరణ అందరకీ తెలిసిందే. తమలో ఉన్న టాలెంట్ సమాజానికి తెలిసేలా చేయడానికి ఇదొక సరైన వేదిక. ఈ యాప్ సహాయంతో రాత్రికి రాత్రే స్టార్లుగా ఎదిగినవారు ఎందరో ఉన్నారు. ఉప్పల్ బాలు, దుర్గా రావు, ఆవేశం స్టార్ నరేష్.. ఇలాంటి వారెందరో ఈ యాప్ ద్వారా సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అది నవ్వులు పాలు చేసినా.. ఆర్థికంగా చేదోడుగా నిలిచినా.. పాపులారిటీ అయితే తెచ్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. టిక్‌టాక్ యాప్ లో ఏదైనా ఒక వైరల్ అయ్యిందంటే దాని ప్రభావం కొన్ని వేల మందిపై ఉంటుంది. ఒక వీడియోను ఛాలెంజ్ గా తీసుకొని.. అచ్చం అలాంటి వీడియోలను మరికొందరు సృష్టించేవారు. ఈ ఫీచరే ప్రముఖ కార్ల కంపెనీలైన కియా, హ్యుందాయ్‌కి తలనొప్పిగా మారింది. ఓ స్క్రూడ్రైవర్, యూఎస్‌బీ కేబుల్ ఉంటే చాలు.. కారును సులువుగా దొంగిలించొచ్చంటూ కొందరు చేసిన వీడియోలు ఆ సంస్థలను కోలుకోలేని దెబ్బె కొట్టింది.
గతేడాది అమెరికాకు చెందిన కొందరు వ్యక్తులు ‘కియా బాయ్స్’ పేరిట కియా, హ్యుందాయ్ కార్లే లక్ష్యంగా చేసుకుని కొన్ని వీడియోలు రూపొందించారు. తాళం అవసరం లేకుండా కార్లను ఎలా స్టార్ట్ చేయొచ్చో ఆ వీడియోల్లో పేర్కొన్నారు. “మొదట స్క్రూడ్రైవర్ సాయంతో స్టీరింగ్ కింద ఉన్న ప్లాస్టిక్ బాక్సును తొలగించి.. యూఎస్‌బీ కేబుల్ సాయంతో కార్లను స్టార్ట్ చేస్తున్నారు”. ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో వందలాది యువకులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్లని తాళం సాయం లేకుండా ఎత్తుకెళ్లడమే ఈ ఛాలెంజ్. ఈ క్రమంలో పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల బారిన పడ్డారు.
Them damn Kia boys stealing cars with chargers 😂😂 pic.twitter.com/ZqsXF4Bmol
— Waldo2️⃣.0️⃣.5️⃣ (@Waldo205_) January 19, 2023
పోనీ, ఇప్పటికైనా ఈ ఛాలెంజ్ ఆగిందా..! అంటే లేదు. ఇప్పటికీ మా కార్లు పోయాయ్ బాబోయ్ అని పోలీస్ సస్టేషన్ మెట్లెక్కుతున్న పౌరులు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన హ్యుందాయ్, కియా కంపెనీలు దొంగతనాలకు చెక్ పెట్టేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేశాయి. లక్షలాది కార్లకు దీన్ని ఉచితంగా అందిస్తున్నాయి. ఈ కొత్త అప్‌డేట్ లో థెఫ్ట్ అలారమ్ సౌండ్‌ను 30 సెకన్ల నుంచి నిమిషానికి పెంచారు. అలాగే వాహనం స్టార్ట్ చేసేందుకు కీ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేశారు. అమెరికా వ్యాప్తంగా 38 లక్షల హ్యుందాయ్ కార్లు, 45 లక్షల కియా కార్లకు ఈ అప్‌డేట్లు అందనున్నాయి. ఇది ‘టిక్‌టాక్’ ఛాలెంజ్ సృష్టించిన గందరగోళం. ‘టిక్‌టాక్’ యాప్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Los Angeles Police Department’s Commercial Crimes Division is aware of a recent social media trend regarding vehicle thefts. Please read the attached Community Alert for more information. pic.twitter.com/E5NfRcXVer
— LAPD HQ (@LAPDHQ) August 26, 2022