ఇటు టాలీవుడ్‌లోనే కాదూ అటు హాలీవుడ్ లోనూ విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు తారకతర్న, దర్శకుడు విశ్వనాథ్, సింగర్ వాణి జయరాం, తమిళ కమెడియన్, సినిమాటోగ్రఫర్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ దిగ్గజ నిర్మాత సతీష్ కౌశిక్, ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ తల్లి వీరంతా కన్నుమూశారు. తాజాగా హాలీవుడ్ నటుడు మరణించగా. . ఇప్పుడు మరో స్టార్ తుది శ్వాస విడిచారు.
ఇటీవల ఎంటర్ టైన్‌మెంట్ రంగాన్ని వరుసగా విషాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటు టాలీవుడ్‌లోనే కాదూ అటు హాలీవుడ్ లోనూ విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు తారకతర్న, దర్శకుడు విశ్వనాథ్, సింగర్ వాణి జయరాం, తమిళ కమెడియన్, సినిమాటోగ్రఫర్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ దిగ్గజ నిర్మాత సతీష్ కౌశిక్, ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ తల్లి వీరంతా కన్నుమూశారు. అటు హాలీవుడ్ లో హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్ లండన్ లో తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. ఈ వార్త మర్చిపో్క ముందే మరో నటి అనారోగ్య సమస్యలతో ప్రాణాలు విడించింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు తెలియజేయశారు.
అమెరికా టిక్ టాక్ స్టార్ జెహానె థామస్ అనారోగ్యంతో మరణించారు. ఆమెకు 30 సంవత్సరాలు. తాను అనారోగ్యం బారిన పడ్డానని ప్రకటించిన కొన్ని రోజులకే ఆమె మరణించారు. కొన్ని వారాల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మాట్లాడుతూ.. దాదాపు 2 సంవత్సరాలుగా తరచూ మైగ్రేన్‌తో బాధపడుతున్నానని, మొదట్లో పట్టించుకోలేదని, తలనొప్పి పెరగడంతో పరీక్షలు చేయించుకోగా ఆప్టిక్ న్యూరైటిస్ అనే అరుదైన వ్యాధి సోకిందని, ఆప్టిక్ న్యూరిటిస్ కారణంగా తన కంటి వద్ద నరాల వాపు కనిపించిందని చెప్పారు. తర్వాత ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటోను తన గో ఫండ్ మీ (GoFundMe) పేజీలో షేర్ చేశారు. అప్పటికే ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదని తెలుస్తోంది. ‘నడవడానికి కూడా వీల్లేదు. తలను పైకి లేపలేను, నడవలేకపోతున్నాను, నొప్పి ఎంత దారుణంగా ఉంటుందో’ అని ఆమె వీడియోలో పేర్కొంది.
ఈ సమయంలో ఆమె ఓ ఎమోషనల్ పోస్టు కూడా చేసింది. తనను, తన కుమారుల్సి చూసుకుంటున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు అంటూ పేర్కొంది. అయితే ఆమె బెడ్ మీద ఉన్న ఫోటోలను చూసి ఆమె ఫాలోవర్స్ ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆ ప్రార్థనలు ఫలించలేదు. ఆమె ఈ అనారోగ్య కారణాలతో గత శుక్రవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలిక్స్ రీస్ట్ తన గో ఫండ్ మీ పేజీలో పంచుకున్నారు. ఇందులో థామస్ మరణానంతరం ఆమె ఇద్దరు కుమారులు ఐజాక్, ఎలిజా గురించి కూడా ప్రస్తావించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. జెహాన్ నిష్క్రమణ పూర్తిగా అనూహ్యమని పోస్ట్‌లో రాశారు. న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం.. టిక్‌టాక్ స్టార్ జహాన్ థామస్ కు దాదాపు 72,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.